English | Telugu

శ్రీదేవి 'రొమాంటిక్' కంపెనీ!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' కొత్త కొత్త స్కిట్స్ తో మంచి ఫేమస్ ఐన షో. ప్రతీ షోలో హైపర్ ఆది, రాంప్రసాద్, నూకరాజు, ఇమ్మానుయేల్ వాళ్ళ టైమింగ్ కామెడీతో నవ్విస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్ కి ఒక్కో కాన్సెప్ట్ తో బుల్లితెర కమెడియన్లు ముందుకొస్తున్నారు. ఈ వారం ఎపిసోడ్ ఐతే ఆద్యంతం చూసే కొద్దీ చూడబుద్దేస్తుంది అన్నట్టుగా డిజైన్ చేసిన‌ట్లు లేటెస్ట్ ప్రోమో తెలియ‌జేస్తోంది. ఈ వారం ఎపిసోడ్ కాన్సెప్ట్ మంచి రసవత్తరంగా, రొమాంటిక్ గా కిక్కెకించేలా డిజైన్ చేశారు.

ఈ ఎపిసోడ్ లో సీరియల్ యాక్ట‌ర్స్‌ కూడా వచ్చి డాన్స్ పెర్ఫార్మెన్సులు చేసి చల్లని వాతావరణంలో హీట్ పుట్టించారు. "దేవుడు కరుణిస్తాడని వరములు కురిసిపిస్తాడని" పాటకు బుల్లితెర సీరియల్స్ యాక్టర్స్ రొమాంటిక్ డాన్స్ చేసి అలరించగా, తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ జంటలు వచ్చి రొమాన్స్ ని మరో యాంగిల్ లో పరిచయం చేశారు ఆడియన్స్ కి.

ఇక ఇదే పాట బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతూ ఉంటే స్టేజి మీద ఫస్ట్ నైట్ కోసం సిద్ధం చేసిన బెడ్ కనిపించింది. ఇదే పాటకు శ్రీదేవి జోడీస్ డాన్స్ చేశారు. ముందుగా హైపర్ ఆది బెడ్ మీదకు వచ్చాడు. తర్వాత ఒక అమ్మాయి కూడా వచ్చి రొమాంటిక్ పెర్ఫార్మన్స్ చేస్తున్నట్లు చూపించారు. తర్వాత ఆదిని ఆమె పిచ్చి కొట్టుడు కొడుతుంది. ఐతే ఆ నటి ఎవరో సరిగా చూపించకుండా చేశారు. వాళ్ళ తర్వాత నటి ఫైమా, పటాస్ ప్రవీణ్ పెళ్లి బట్టల్లో బెడ్ మీదకు వచ్చి రొమాన్స్ చేశారు.

ఇలా ఈ వారం షో మొత్తం రొమాంటిక్ గ్గా ప్లాన్ చేశారు. ఈ షోకి హైలైట్ ఏంటి అంటే నటి ప్రగతి, సీనియర్ హీరోయిన్ సంఘవి గెస్టులుగా వచ్చేసారు. ఐతే ఆదితో ఫుల్లుగా ఆడేసుకుంది సంఘవి. "మొదటిసారి ముద్దు పెడితే.. సాంగ్ చేశారు కదా మీరు.. రెండో సారి, మూడో సారి పెడితే ఎలా ఉంటుంది?" అని ఆది అడిగేసరికి "బాగానే ఉంటుంది, నీకు రెండిస్తే ఇంకా బాగుంటుంది" అంటూ కౌంటర్ వేసేసింది.

ఇక ఫైనల్ గా ఒక్కో జంట స్టేజి మీదకు వచ్చి సందడి చేశాయి. బుల్లెట్ భాస్కర్ వాళ్ళ నాన్న శాంతిస్వరూప్ ని పెళ్లి చేసుకున్నట్టు చూపించారు. భాస్కర్ లైన్ లోకి వచ్చి "అమ్మకు అన్యాయం చేస్తావా నాన్నా?" అని అడిగాడు.. "ఈ అమ్మాయికి న్యాయం చేద్దామని" అంటూ లేడీ గెటప్ లో ఉన్న శాంతిస్వరూప్ ని చూపించాడు నాన్న‌.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.