English | Telugu
పిజ్జాలో గోంగూర చట్నీ వేసుకుని తిన్నట్టుంది నీ లుక్...
Updated : Jul 25, 2023
"ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్" నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర నటీ నటులు ఫుల్ ట్రెండీ లుక్ లో అలాగే ట్రెడిషనల్ గెటప్ లో వచ్చేసారు. అదే ఈ వారం థీమ్ "ట్రెండీ బాయ్స్ వెర్సెస్ ట్రెడిషనల్ గర్ల్స్" పేరుతో రాబోతోంది ఈ షో. ఇక శ్రీముఖి వచ్చి బ్రహ్మముడి సీరియల్ కావ్యతో "పైన ట్రెండీ కింద ట్రెడిషనల్ గా ఉన్నాను కదా" దీని మీద నీ ఒపీనియన్ అని శ్రీముఖి అడిగేసరికి "పిజ్జాలో గోంగూర చట్నీ వేసుకుని తింటే ఎలా ఉంటుందో అలా ఉంది" అని చెప్పింది. దానికి శ్రీముఖి షాకైపోయింది. తర్వాత బాయ్స్ దగ్గరకు వచ్చి "ట్రెండీ అమ్మాయిలు ఇష్టమా, ట్రెడిషనల్ అమ్మాయిలు ఇష్టమా" అని అడిగేసరికి "అమ్మాయి అంటే ఇష్టం" అని చెప్పాడు బ్రహ్మముడి సీరియల్ లో విలన్ రోల్ లో చేసే రాహుల్ అలియాస్ శ్రీకర్ కృష్ణ. ఇక లేడీస్ దగ్గరకు వచ్చి "దీపికా నువ్వు ఒకసారి సిగ్గుపడు" అని బ్రహ్మముడి హీరోయిన్ కావ్యని అడిగింది.
దానికి దీపికా సిగ్గు పడిపోతూ ఉండేసరికి ఎక్స్ప్రెస్ హరి వచ్చి "సిగ్గుపడితే అబ్బాయిలు పడిపోవాలి..మీరు పడిపోకూడదు పక్కకు" అన్నాడు. ఆ డైలాగ్ కి అందరూ నవ్వేశారు. ఈ షోలో ప్రతీవారం కొత్త కొత్త గేమ్స్ ఆడిస్తూ ఆడియన్స్ ని అలరిస్తోంది శ్రీముఖి. ఇక ఈ షోకి ఫేమస్ సీరియల్స్ నుంచి యాక్టర్స్ వచ్చారు. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోకి మంచి రేటింగ్ వస్తోంది. ఈ షోలో ముక్కు అవినాష్, ఎక్స్‌ప్రెస్ హరి కామెడీకి ఫైమా హడావిడి తోడయ్యేసరికి షో మంచి ఎంటర్‌టైనింగ్‌గా సాగుతోంది. బ్రహ్మముడి, ఎన్నెన్నో జన్మల బంధం, జానకి కలగనలేదు, నాగ పంచమి సహా స్టార్ మాలో ప్రసారమయ్యే టాప్ రేటింగ్ సీరియల్స్ సెలబ్రెటీలు అందరూ ఈ షోలో సందడి చేస్తుంటారు.