English | Telugu

Karthika Deepam2 : నీకు కొడుకు ఉన్నాడేమో కానీ నాకు భర్త లేడు.. కష్టాలు చెప్పుకున్న దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -35 లో.... సుమిత్రపై హత్యాయత్నం కేసులోనూ.. జోత్స్న యాక్సిడెంట్ కేసులోనూ దీప సాక్ష్యమే కీలకం కాబట్టి నిందితులు దొరికే వరకూ దీప ఇక్కడే ఉండాలి. ఆమె ఎక్కడికీ వెళ్లకుండా చూసుకునే బాధ్యత మీదే.. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని పోలీసులు గట్టిగా చెప్తారు. అయితే అనసూయకి ఏం అర్ధం కాదు. ఇంతలో దశరథ్.. అమ్మా దీప.. ఈవిడ ఎవరని అనసూయ వైపు చూస్తూ అడుగుతాడు. మా అత్తయ్య.. ఊరు నుంచి మా కోసం వచ్చిందని దీప చెప్తుంది. ఏమ్మా.. నువ్వేం పనిపై వచ్చావని పారిజాతం అడుగగా.. ఏ.. అన్నీ నీకు చెప్పాలా? అని శివనారాయాణ అంటాడు. చూడు దీపా.. నువ్వు చేసింది నాకు నచ్చలేదు.. నేను ప్రేమగా శౌర్య మెడలో గొలుసు వేస్తే దాన్ని కూడా వదిలేసి వెళ్లిపోతావా? అమ్మా సుమిత్రా.. ఆ గొలుసుని శౌర్య మెడలో వేయి అని అంటాడు. దాంతో సుమిత్ర.. శౌర్యని దగ్గరకు తీసుకుని తన మెడలో గొలుసు వేస్తుంది. కొన్ని బంధాలను ముడి వేసేది కలకాలం ఉండాలని తెంపుకుపోవాలని కాదని దీపతో సుమిత్ర అంటుంది. సొంత నానమ్మని ఎప్పుడూ రూపాయి కూడా ఇవ్వలేదు.. ఈవిడేంటి? బంగారు గొలుసు వేసింది.. పైగా ఇది అమ్మమ్మా అని పిలుస్తుందేంటని అనసూయ అనుకుంటుంది.

ఏంటి దీప ఇదీ.. అసలు ఏం జరగుతుంది? ఆ కారేంటీ.. ఈ ఇల్లేంటి.. ఈ మనుషులేంటీ.. నువ్వేదో ఈ ఇంటి మనిషివి అయినట్టు వాళ్లు అంత ప్రేమగా మాట్లాడటమేంటి? ఆ పోలీసులు ఏంటి? నీ బాధ్యత అతనికెవరికో అప్పగించడం ఏంటి? అసలు ఏం జరుగుతుందే అని అనసూయ. అడుగగా.. అన్నీ మీకు వివరంగా చెప్తాను.. పదండి అని తను ఉండే ఇంటికి తీసుకుని వెళ్తుంది దీప. హా పదా పదా.. రెండురోజుల్లో తిరిగి వస్తానన్న మనిషి.. ఫోన్ కూడా చేయడం లేదంటే ఏదో అనుకున్నా.. నీకు ఇక్కడ ఇన్ని భోగాలు ఉంటే ఊరు నేను ఏంటీ నీకు నువ్వే గుర్తుండవని అనసూయ మాట్లాడుతుంది. మీరు గుర్తు లేకుండా ఊరికి బయల్దేరానా? అని అంటుంది దీప. అంటే.. నా కొడుకు నీకు కనిపించలేదా? అని అనసూయ అనగా.. లేదు నానమ్మా.. కనిపించలేదని శౌర్య అంటుంది. ఏంటి అత్తయ్యా ఆలోచిస్తున్నారని దీప అనడంతో.. అన్నీ తరువాత చెప్తాను కానీ ముందు ఏదైనా వండిపెట్టవే ఆకలితో చచ్చిపోయేట్టు ఉన్నానని అమసూయ అంటుంది. కాసేపటికి దీప‌ జరిగిందంతా అనసూయకి చెప్తుంది. ఆ పెద్దావిడని కాపాడినందుకు డబ్బులు బలంగానే ఇచ్చి ఉంటారే.. ఎంత ఇచ్చారేంటని అడుగగా.. నేను డబ్బు కోసం ఆ పని చేయలేదని దీప అంటుంది. నువ్వు అడగవులే.. వాళ్లు ఇస్తారు కదా అని అనసూయ అంటుంది. సాయం చేస్తానన్నారు.. నేను వద్దన్నానని దీప అనగానే.. దరిద్రుల్ని ఎవరూ బాగు చేయలేరంటే ఇదేమరి అని అనసూయ అంటుంది. నువ్వు ఏం అనుకున్నా పర్లేదు అత్తయ్యా.. అని అంటుంది దీప. చచ్చిన నా తమ్ముడు తిరిగొచ్చినా నిన్ను బాగు చేయలేడని అనసూయ అంటుంది. సరే ఈ సోదంతా నాకెందుకులే కానీ ఆ నర్సిగాడు కనిపించాడా? అని అడుగుతుంది.

ఉదయం మాట్లాడుకుందామని పడుకోమని దీప అనగానే.. అంత చాటుగా మాట్లాడుకునేంత తప్పు ఏం చేశావ్? ఏ తప్పు చేయనప్పుడు.. ఇలా ఎందుకు సమధానం దాటవేస్తావని అంటుంది. దాంతో దీప.. అవును నేను తప్పు చేశాను.. నీ కొడుకుని పెళ్లి చేసుకుని తప్పుచేశాను.. అందుకు ఈరోజు ఏడుస్తున్నానని దీప కుప్పకూలిపోతుంది. దాంతో అనసూయ.. అంటే నీకు నర్సిగాడు కనిపించాడా? అని అడుగగా.. అవును కనిపించాడని దీప చెప్తుంది. వాడు కనిపిస్తే నువ్వు ఇక్కడెందుకు ఉన్నావని అంటుంది. నీకు కొడుకు ఉన్నాడేమో కానీ నాకు భర్త లేనట్టే.. వేసిన మూడు ముళ్లు తప్ప నాకేం మిగల్చలేదని దీప ఏడుస్తుంది. వాడేం చేశాడో చెప్పు? ఏమైందే అని అనసూయ అడుగగా.. నీ కొడుకు రెండో పెళ్లి చేసుకున్నాడు అత్తయ్యా అని దీప అంటుంది. ఏంటీ ఆ వెధవ ఇంత పని చేశాడా? రెండో పెళ్లి చేసుకున్నాడా?? మరి నువ్వెందుకు ఊరుకున్నావని అనసూయ అడుగగా.. నేను నిలదీశాను అత్తయ్యా.. నన్ను ఉంచుకుంటానని అన్నాడని చెప్పి దీప ఏడుస్తుంది. అంత మాట అన్నాక.. నువ్వెందుకు ఊరుకున్నావ్.. మొహం పగలకొట్టకపోయావా? అని‌ అనసూయ అంటుంది. పశువులా మాట్లాడితే కొట్టి లాభమేంటి అత్తయ్యా.. అతనికి భార్య, కూతురు, తల్లి ఎవరూ అవసరం లేదు.. అతని దారి అతను చూసుకున్నాడంటు దీప జరిగింది మొత్తం చెప్తుంది. వాడు నిన్ను అప్పుల్లోనే వదిలాడనుకున్నా కానీ కష్టాల్లో వదిలేశాడని అనుకోలేదంటూ అనసూయ ఎమోషనల్ అవుతుంది. వస్తే నీ మొగుడుతో రా.. లేదంటే డబ్బుతో రా అన్నావ్.. కానీ ఇక్కడ రెండూ లేవని దీప ఏడుస్తుంది. మనకి వారం టైం పెట్టారు. వారంలోపు డబ్బులతో వెళ్తే ఇల్లు ఉంటుంది లేదంటే ఇంటిని వేలం వేసేస్తారు. అది నా తమ్ముడు కట్టిన ఇల్లు. దాన్ని ఎలా కాపాడుకోవాలో ఏంటోనని అనసూయ బాధపడుతుంది. ఇంట్లో వాళ్లకి నీ కష్టాలు తెలుసా? అని అనసూయ అడగడంతో.. లేదు అత్తయ్యా.. వాళ్లు ఎంత అడిగిన నేను చెప్పలేదు.. నువ్వు కూడా చెప్పకని దీప అంటుంది. సరిగ్గా అప్పుడే సుమిత్ర ఎంట్రీ ఇస్తుంది. దీప వైపు కోపంగా చూస్తుంది. మరోవైపు కార్తీక్ అమ్మనాన్నలు ఎంతో ప్రేమగా ఉంటారు. కాంచనకి ప్రేమగా గోరు ముద్దలు తినిపిస్తాడు శ్రీధర్. అప్పుడే కార్తిక్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.