English | Telugu

ఆడియన్స్‌కు డబుల్ ధమాకా అందిస్తున్న విశ్వక్‌సేన్‌ ‘ఫ్యామిలీ ధమాకా’

ప్రస్తుతం ఓటీటీ సంస్థల హవా నడుస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలు చూడాలన్నా, రియాలిటీ షోస్‌ చూడాలన్నా ఓటీటీ అందుబాటులో ఉంది. ఎన్ని సంస్థలు ఉన్నా తెలుగులో ఒటీటీ మాత్రం ‘ఆహా’ ఒక్కటే. ఇటీవలి కాలంలో ఆహాలో చాలా రియాలిటీ షోలు వచ్చాయి. ఎంతో ప్రజాదరణ పొందాయి. తాజాగా ‘ఫ్యామిలీ ధమాకా’ పేరుతో ఓ రియాలిటీ షో వచ్చింది. యంగ్‌ హీరో, డైరెక్టర్‌ విశ్వక్‌సేన్‌ హోస్ట్‌గా వ్యవహరించే ఈ షో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్‌ చేస్తూ డిజైన్‌ చేశారు. ఈ షోకి సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ సెప్టెంబర్‌ 7న స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ ‘ఫ్యామిలీ ధమాకా’ ఎలా వుంది? ఆడియన్స్‌ని ఎంతవరకు ఎంటర్‌టైన్‌ చేసింది అనేది తెలుసుకుందాం.

ఈ షోకి సంబంధించి మొదట చెప్పుకోవాల్సింది విశ్వక్‌ సేన్‌ గురించి. ఫస్ట్‌ టైమ్‌ ఇలాంటి షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ ఎలాంటి టెన్షన్‌ లేకుండా అందరితో కలిసిపోయి మొదటి ఎపిసోడ్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేశారు. వెరైటీగా సాగే ఈ షోకి రెండు ఫ్యామిలీస్‌ని ఆహ్వానిస్తారు. ఆ రెండు ఫ్యామిలీస్‌ మధ్య పోటీ నిర్వహిస్తారు. అదెలాగంటే కొన్ని ప్రశ్నలు రెడీ చేసి వారి 100 మంది సాధారణ ప్రేక్షకుల ముందు ఉంచుతారు. ఆ ప్రశ్నలకు వారు చెప్పిన సమాధానాల్లో ఎక్కువ మంది చెప్పిన ఒకే సమాధానాన్ని టాప్‌ టెన్‌లో ఉంచుతారు. షోకి వచ్చిన రెండు ఫ్యామిలీస్‌ని అవే ప్రశ్నలు అడుగుతారు. 100 మంది చెప్పిన సమాధానాలకు ఈ ఫ్యామిలీస్‌ చెప్పిన సమాధానాలు టాప్‌ టెన్‌ లిస్ట్‌లో ఉన్నదాని ప్రకారం పాయింట్స్‌ ఇస్తారు.

ఈ షోలో మూడు రౌండ్స్‌ ఉంటాయి. మొదటి రౌండ్‌ ధమాకా, రెండో రౌండ్‌ డబుల్‌ ధమాకా, మూడో రౌండ్‌ ధూమ్‌ ధమాకా, నాలుగోది అడ్వాన్స్‌డ్‌ రౌండ్‌. అది షోలో పార్టిసిపేట్‌ చేసే ఫ్యామిలీస్‌ చేతిలో ఉంటుంది. రెండు ఫ్యామిలీస్‌లో ఏదో ఒక ఫ్యామిలీ ధూమ్‌ ధమాకా రౌండ్‌ వరకు వచ్చి అది కూడా గెలిస్తే 1 లక్ష రూపాయల క్యాష్‌ ప్రైజ్‌ అందిస్తారు. ఒకవేళ ధూమ్‌ ధామ్‌ ధమాకా వరకు వచ్చి గెలుచుకుంటే 2 లక్షల రూపాయల క్యాష్‌ ప్రైజ్‌ గెలుచుకుంటారు. అంతేకాదు, రిలీఫ్‌ కోసం మధ్య మధ్య ఈ రెండు ఫ్యామిలీస్‌కి సరదాగా గేమ్స్‌ కూడా ఉంటాయి.

మొదటి ఎపిసోడ్‌లో పెండ్యాల ఫ్యామిలీ, మహేంద్రదా ఫ్యామిలీ పాల్గొన్నారు. రెండు ఫ్యామిలీస్‌లోని మెంబర్స్‌ ఎంతో ఉత్సాహంగా ప్రతి రౌండ్‌లోని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. షో రూల్‌ ప్రకారం పాయింట్స్‌ పరంగా ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత పెండ్యాల ఫ్యామిలీ ధూమ్‌ ధమాకా వరకు వచ్చింది. మహేంద్రదా ఫ్యామిలీ షో నుంచి నిష్క్రమించింది. పెండ్యాల ఫ్యామిలీ ధూమ్‌ ధమాకా రౌండ్‌లో కూడా విజయం సాధించి 1 లక్ష రూపాయల క్యాష్‌ ప్రైజ్‌ను గెలుచుకుంది. ఈ షోను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు విశ్వక్‌సేన్‌. పార్టిసిపేట్‌ చేయడానికి వచ్చిన రెండు ఫ్యామిలీస్‌తో, షోను చూడడానికి వచ్చిన ఆడియన్స్‌తోనూ ఎంతో సరదాగా మాట్లాడుతూ అందరి అభినందనలు అందుకున్నారు. మధ్య మధ్య ఛలోక్తులతో అందర్నీ నవ్వించారు. షో ప్రారంభంలో వచ్చే ‘ఫ్యామిలీ ధమాకా’ టైటిల్‌ సాంగ్‌కి డాన్సర్స్‌తో కలిసి స్టెప్పులేసి అందర్నీ అలరించారు విశ్వక్‌సేన్‌.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.