English | Telugu
రష్మీ విజయ్ తో మిస్ చేసుకున్న మూవీస్ ఇవే...బిచ్చగాడు 3 లో రష్మీకి అవకాశం
Updated : Jun 30, 2025
యాంకర్ రష్మీ మాములు యాంకర్ కాదు. ఆమె మంచి మూవీ ఆఫర్స్ ని వదిలేసుకుందన్న విషయం ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో తెలిసింది. ఈ వారం షోకి మార్గన్ మూవీ వచ్చింది. అలాగే బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూడా వచ్చారు. ఇక రష్మీ , విజయ్ ఇద్దరూ క్లోజ్ గా మాట్లాడుకోవడం చూసి రామ్ ప్రసాద్ అడిగేశాడు. "రష్మీ నా ఫస్ట్ మూవీలో నటించాల్సి ఉంది. డాక్టర్ సలీం మూవీలో చేయాలి వుంది.
బేతాళుడు మూవీ టైంలో కూడా రష్మీ కోసం వెయిట్ చేశా.. తాను నటిస్తుందేమో అనుకున్నా..కానీ ఇదంతా పక్కన పెడితే త్వరలో నా మూవీలో చేయబోతోంది." అని చెప్పారు. దాంతో రాంప్రసాద్ " హిట్ సినిమాలో ఛాన్స్ పోగొట్టుకున్నావా రష్మీ నువ్వు ...సర్ మాదో చిన్న రిక్వెస్ట్ మీరు చేసిన బిచ్చగాడు 1 , 2 రెండూ చూసాం రష్మీని పెట్టి బిచ్చగత్తె 3 తియ్యండి..రష్మీ నా బిక్కగాడు 3 మూవీలో నటించబోతోంది. రష్మీని త్వరలో బిచ్చగత్తెలా చూడబోతున్నాం..దానికి ఆనందంగా ఉంది నాకు" అంటూ రాంప్రసాద్ కామెడీ చేసాడు. ఐతే మార్గన్ మూవీ హీరో అజయ్ వెంటనే " ఈ మూవీలో రొమాన్స్ సర్ కి కాదు నాకు" అన్నాడు. "డైరెక్టర్ నాకు పెయిర్ ఇచ్చారు కానీ రొమాంటిక్ సీన్స్ లేవు" అన్నారు విజయ్. "నెక్స్ట్ పార్ట్ లో ఫుల్ రొమాన్స్ పెడదాం" అని డైరెక్టర్ చెప్పాడు. దాంతో రష్మీ "సర్ మార్గన్ పార్ట్ 2 లో విత్ అగ్రెసివ్ లవ్ " అంది. "అందరూ నన్ను సీరియస్ పర్సన్ అనుకుంటారు రష్మీ కానీ నేను చాల రొమాంటిక్ పర్సన్ ని" అన్నారు విజయ్. "సరే ఇప్పుడు రొమాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సినిమాలో ఎలాగో జరగలేదు కాబట్టి ఇక్కడ ఒక రెండు నిముషాలు రొమాంటిక్ సీన్ చేద్దాం అంటూ ఇద్దరూ కలిసి డాన్స్ వేశారు.