English | Telugu

బిగ్ బాస్ సీజన్ 9 కి కామన్ మ్యాన్ గా అప్లై చేసుకునే వాళ్లకు ఆదిరెడ్డి టిప్స్


బిగ్ బాస్ సీజన్ 9 కి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఎలా అంటూ గత బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ కి వెళ్లాలనుకునే కామన్ మ్యాన్ కోసం కొన్ని టిప్స్ చెప్పాడు. త్వరగా అప్లై చేసి పంపించేయండి. బిగ్ బాస్ కి కావాల్సింది డిఫెరెంట్ క్యారెక్టర్స్ ఉండే కంటెస్టెంట్స్ . మీరు ఏ కేటగిరీలో పంపిద్దామనుకున్నారో ఆ కేటగిరీలో ఇంకా ఎవరైనా ముందుగా పంపించేస్తే మీ వీడియోస్ ని పరిశీలించే అవకాశం ఉండదు. సింపుల్ గా నువ్వు ఏంటి అనేది వాళ్లకు తెలిసేలా 3 మినిట్స్ వీడియో చేసి పంపించాలి. నువ్వెంటి నీ ఫామిలీ ఏంటి, బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వద్దామనుకుంటున్నావ్..వస్తే జనాలను ఎలా ఎంటర్టైన్ చేస్తావ్ అనే చెప్తూ నీ నేచర్ ఏంటి అనేది బిగ్ బాస్ కి అర్ధమవ్వాలి.

నువ్వు హైపర్ గా క్యారెక్టర్ ఐతే అలాగే ఆ వీడియోలో ప్రాజెక్ట్ చేయాలి..నువ్వు అగ్రెసివ్ పర్సన్ ఐతే అలాగే ఆ వీడియోలో కనిపించాలి. పూర్ బ్యాక్ గ్రౌండ్ ఐతే అది కూడా చూపించుకోవచ్చు. ఏ జాబ్ ఐనా కానీ జెన్యూన్ గా నువ్వెంటో ఆ వీడియోలో చూపించుకోవాలి. బిగ్ బాస్ ఇలాంటి వాళ్లనే సెలెక్ట్ చేస్తారని లేని క్వాలిటీని తెచ్చిపెట్టుకుని వీడియోస్ చేయొద్దు. ఇక వీడియోని అప్లోడ్ చేశాక బిగ్ బాస్ టీమ్ అంటూ డబ్బులు డిమాండ్ చేస్తూ కాల్స్ వస్తాయి. కానీ అవన్నీ ఫేక్. బిగ్ బాస్ టీమ్ ఎలాంటి డబ్బులు అడగరు. కాబట్టి ఆ ఫేక్ కాల్స్ కి, ఫేక్ వెబ్ సైట్స్ కి దూరంగా ఉండండి అంటూ చెప్పాడు." అంటూ చెప్పుకొచ్చాడు ఆది రెడ్డి. ఇక బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కాబోతోంది. ఐతే బిగ్ బాస్ లోకి సెలబ్రిటీస్ తో పాటు కామన్ మ్యాన్ కూడా వెళ్తూ ఉంటారు. కామన్ మ్యాన్ క్యాటిగరీలో ఇప్పటి వరకు ఆదిరెడ్డి, గలాటా గీతూ, పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు వెళ్లారు. ఇక ఇప్పుడు కొత్త సీజన్ లో కూడా కామన్ మ్యాన్ క్యాటిగారీ కోసం వెబ్సైటులో నమోదు చేసుకోమంటూ ఒక లింక్ కూడా ఇచ్చారు. ఇందులో మొత్తం ఫైవ్ లెవెల్స్ లో ఈ సెలక్షన్ జరగబోతోంది. ముగ్గురు కామన్ మ్యాన్ ని తీసుకునే అవకాశం కూడా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి.