Read more!

English | Telugu

మూవీ డిలే అయ్యేసరికి చాలా బాధపడ్డాడు....నా ప్రతీ రూపాయి మనది

సిక్స్త్ సెన్స్ సీజన్ 6 ఈ వారం షోలో అన్నదమ్ముల అనుబంధం బాగా కనిపించింది. షో ఎండింగ్ లో లాకర్ ఓపెన్ చేసే రౌండ్ కి వచ్చేసరికి రఘు కుంచె, హిడింగా మూవీ డైరెక్టర్ అనిల్ కన్నెగంటి కూడా యాడ్ అయ్యారు. ఇక ఇందులో అశ్విన్ ని పిలిచి "నీ లైఫ్ లో ఎప్పుడన్నా నీ ఎక్స్పెక్ టేషన్కి నేను రీచ్ కాలేదా" అని అడిగాడు ఓంకార్. " నేను అడగకముందే అన్నీ ఇచ్చావ్.

నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు." అని చెప్పాడు అశ్విన్. "నాకు చెప్పుకోలేని ఏదైనా బాధను నువ్వు దాచిపెట్టావా" అని ఓంకార్ అడిగేసరికి అశ్విన్ ఏడ్చేశాడు "ఇప్పటివరకు మమ్మల్ని చూసుకుంటూనే ఉన్నావ్...ఇంకా చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకు నిన్ను..ఫైనాన్సియల్ గా నేను స్ట్రాంగ్ కాదు అన్నయ్య..ఇంకా కష్టపడుతున్నా...సెటిల్ కాలేదని బాధ  అంతకు మించి ఏమీ లేదు " అని చెప్పాడు అశ్విన్ "ఆ ఆలోచనలు నీ మనసులోంచి తీసేయ్...నువ్వు కళ్యాణ్ లేకుండా ఓంకార్ అనేవాడు లేడు..నాన్న ఐనా అన్నయ్య ఐనా అన్నీ నేనే మీకు...నా ప్రతీ రూపాయి మనది...ఇలా లేని ఎంతోమంది ఉన్నారు. నువ్వు ఎప్పుడూ బాధపడకు...ఆఖరి శ్వాస వరకు  ఏ కష్టమైన నన్ను దాటుకుని మీ దగ్గరకు రావాలి." అని చెప్పాడు ఓంకార్. "సినిమా గురించి చాలా ఫీలయ్యాడు అన్నయ్య. ఈ మూవీ స్టార్ట్ చేసి రెండున్నరేళ్లు అయ్యింది. చాలా డెడికేటెడ్ గా కష్టపడ్డాడు.

ఒక సీన్ లో అతని చెయ్యి కాలిపోయింది.. తాను తీసుకున్న రెమ్యూనరేషన్ చాలా తక్కువ...ప్రొడ్యూసర్ ని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాడు. తొందరగా సినిమా అవుతుంది..అందరికీ పేరొస్తుంది అని అనుకుని అందరి గురించి ఆలోచించాడు..కానీ ఆ మూవీ ప్రాసెస్ బాగా డిలే అయ్యేసరికి అందరిలో ఒక పెయిన్ కనిపించింది...అశ్విన్ లో ఇంకా ఎక్కువ చూసా. దాని గురించి మీకు చెప్పలేదు. ఇన్నేళ్ల తర్వాత ఈ మూవీ ఇప్పటికి వచ్చింది. కానీ ఈ మూవీ తర్వాత అశ్విన్ చాలా పెద్ద పొజిషన్ కి వెళ్తాడు." అని చెప్పారు మూవీ డైరెక్టర్ అనిల్ కన్నెగంటి..