English | Telugu

ఆయన చెప్పిన కథ విని ఇన్ని కష్టాలు ఉన్నాయా అనుకున్నా...

కొత్త కొత్త షోస్ ఎన్ని బుల్లితెరను అలరిస్తూ ఉన్నా ఇంకా ఏదో కావాలి అనిపిస్తూనే ఉంటుంది ఆడియన్స్ కి. ఎన్ని షోస్, ఈవెంట్స్ ప్రసారమవుతున్న సరే దేని రేటింగ్ దానిదే. మరి త్వరలో ఈటీవీలో "అలా మొదలయ్యింది" అంటూ ఒక షో స్టార్ట్ కాబోతోంది. ఈ షోకి ఎవరో తెలుసా మరి. ఆయన కామెడీలో బోల్డంత వెన్నెల కురుస్తూ ఉంటుంది. ఆయనే వెన్నెల కిషోర్. ఈ షోకి హోస్ట్ గా రాబోతున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద ఆల్రెడీ తన కామెడీ పీక్స్ ని చూపించేసి ఇప్పుడు బుల్లితెరని ఒక ఆటాడుకోవడానికి రెడీ అయ్యారు. ఇక ముందుగా ఈ ఎపిసోడ్ కి నిఖిల్ తన వైఫ్ తో కలిసి వచ్చాడు. "పాత నిఖిల్ గా కాకుండా కొత్త నిఖిల్ గా డీల్ చేయమంటారు" అని నిఖిల్ వైఫ్ పల్లవిని అడిగేసరికి "పాత నిఖిల్ ఎలా ఉండేవారు" అంది. "మీ నాన్న, అమ్మ గారి పేరు ఏమిటి" అని అడిగేసరికి సరిగా చెప్పలేకపోయాడు నిఖిల్.

"పెళ్లి తర్వాత వాళ్ళతో అవసరం ఐపోయింది కదా" అని నిఖిల్ మీద సెటైర్ వేసింది. "ఇంత మీరిద్దరూ ఎలా కలిశారు" అని వెన్నెల కిషోర్ అడిగేసరికి "మేం పేరెంట్స్ కి చెప్పిన వెర్షనా లేదంటే నిజంగా జరిగిన వెర్షనా" అని నిఖిల్ అడిగాడు. "నిజంగా జరిగిన వెర్షన్" అని చెప్పేసరికి "ఐతే ఇది పేరెంట్స్ చూస్తారుగా" అన్నాడు నిఖిల్. "లేదు చూడరు" అన్నారు కిషోర్. "సాడ్ స్టోరీ చెప్పి నన్ను పడేసారు..అప్పుడు నేననుకున్నా పాపం ఇన్ని బాధలున్నాయా ఇతనికి" అని చెప్పింది. "మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కాబట్టి ఓకే లేదంటే ఎంతమంది పల్లవిలకు మెస్సేజెస్ పెట్టేవాడో నిఖిల్ " అన్నాడు కిషోర్...తర్వాత "హలో గురు ప్రేమ కోసమే" అంటూ పాట పాడాడు నిఖిల్. దాంతో పల్లవి "నాకు తర్వాత అర్ధమయ్యింది తనను తాను పొగుడుకోవడానికే ఈ పాట వాడారని" అని చెప్పి నిఖిల్ పరువు తీసేసింది. ఈ షో ఈటీవీ విన్ 28 మార్చ్ రాత్రి 9 . 30 కి ప్రసారం కాబోతోంది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ మాత్రం " వెన్నెల కిషోర్ గారితో షో అంటే మామూలుగా ఉండదు కామెడీ. చాలా మంచి డెసిషన్ ..బుల్లితెర మీద కిషోర్ ని చూడడం చాలా హ్యాపీగా ఉంది" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.