English | Telugu
రాజీవ్ పంతం గెలుస్తుందా.. లేక వసుధార ప్రేమ నిలుస్తుందా!
Updated : Jan 5, 2023
'గుప్పెడంత మనసు' ఇప్పుడు మాటీవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్. మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో రిషిని బయటకు వెళ్ళమని చెప్తుంది. అయితే గత రెండు రోజులుగా వసుధార పెళ్ళి చుట్టూ కథ నడుస్తోంది. ఒకవైపు రిషి తన ప్రేమను దక్కించుకోవాలని ప్రయత్నిస్తుండగా, మరో వైపు వసుధారని పెళ్ళిచేసుకోవాలని రాజీవ్ చూస్తున్నాడు. వసుధార తండ్రి చక్రపాణి తన పంతం నెగ్గించుకోవాలనుకుంటున్నాడు. దీంతో ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు ఆసక్తిని పెంచుతూ వస్తోంది.
బుధవారం జరిగిన ఎపిసోడ్ లో రిషి మాట్లాడుతూ "వసుధార.. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు. ఎవరైనా నిన్ను బెదిరిస్తున్నారా చెప్పు" అని అడుగుతాడు. దానికి వసుధార "ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ సర్. మీరు ఇక్కడ నుండి వెళ్ళండి" అని అంటుంది. దాంతో రిషి ఎమోషనల్ గా అక్కడి నుండి వెళ్లిపోతాడు. కాగా అక్కడే ఉన్న జగతి మేడం, వసుధారని తిడుతుంది. "ఏమైంది వసుధార.. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ పెళ్లి ఏంటి? రిషీతో నీ పెళ్లి గురించి మాట్లాడటానికే కదా మమ్మల్ని పిలిచావు. మరి ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావ్?" అని జగతి మేడం అడుగుతుంది. "మేడం.. మీరు కూడా ఇక్కడి నుండి వెళ్ళండి" అని అంటుంది వసుధార. అలా వసుధార మాట్లాడిన మాటలకు మహేంద్రకు కోపం వస్తుంది. "మీ శిష్యురాలు.. ది గ్రేట్ వసుధార.. యూత్ ఐకాన్.. యూనివర్సిటీ టాపర్.. నీకు మంచి గురుదక్షిణే ఇచ్చింది.మనం ఇక్కడి నుండి వెళ్లకుంటే మనల్ని మెడ పట్టుకొని గెంటేలా ఉంది. పద వెళ్దాం" అని జగతితో అంటాడు మహేంద్ర. అలా అనగానే జగతి, మహేంద్ర ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు.
ఆ తర్వాత వసుధార పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. సరిగ్గా రాజీవ్ తాళి కడుతున్న సమయానికి తన మెడలోని తాళిని బయటికి తీస్తుంది వసుధార. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తర్వాత రాజీవ్ బలవంతంగా వసుధార మెడలోని తాళిని తీయడానికి ప్రయత్నిస్తాడు. ఆ తోపులాటలో వసుధార తండ్రి చక్రపాణి కిందపడిపోతాడు. దాంతో అతడి తలకు తీవ్రగాయమవుతుంది. అయిన సరే రాజీవ్ పట్టించుకోకుండా వసుధారని బలవంతం చేస్తాడు. దీంతో తనని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది వసుధార. దీంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే వసుధారని రాజీవ్ బలవంతంగా పెళ్ళి చేసుకుంటాడా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..!