English | Telugu

బిగ్ బాస్ గ్లామర్ క్వీన్ వసంతి అవుట్!

బిగ్ బాస్ ప్రతీ వారం సస్పెన్స్ తో కూడిన థ్రిల్లర్ ని జోడిస్తూ వస్తోంది. శనివారం రోజు ఆదిత్య ఎలిమినేట్ కాగా, ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో వసంతి ఎలిమినేట్ అయింది. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. గ్లామర్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే కంటెస్టెంట్ ఎవరు అంటే అందరు ఠక్కున వసంతి పేరు చెబుతారు..అంటే అంతలా మేకప్ అవుతు ఉంటుంది. ఎప్పుడు ఎవరితో గొడవలు లేకుండా, తన దాకా వస్తేనే పాయింట్ మాట్లాడే వసంతి ఎలిమినేట్ అవ్వడం అందరిని నిరాశకి గురి చేస్తోంది.

అయితే నాగార్జున వచ్చి రాగానే నామినేషన్లో ఉన్నవాళ్ళని పిలిచి సేవింగ్ ప్రకియను మొదలుపెట్టాడు. అందులో నుండి ఫైమా, కీర్తి భట్ సేవ్ అయ్యారు.‌ సన్ డే ఫండే అంటూ ఆడించాడు. గేమ్ పేరు 'బొమ్మ గీసి..సినిమా పేరు చెప్పాలి'. దీనికి గాను నాగార్జున, హౌస్ మేట్స్ ని రెండు టీంలుగా విభజించి గేమ్ ఆడించాడు. "ప్రతీ రాంగ్ ఆన్సర్ కి పనిష్మెంట్ ఉంటుంది" అని నాగార్జున చెప్పాడు. ఆ గేమ్ జరుగుతున్నప్పుడు హౌస్ మేట్స్ లోని ఆడవాళ్ళతో ఆదిరెడ్డిని డ్యాన్స్ చేపించాడు. కాగా పనిష్మెంట్ గా ఒకసారి ఇనయా, వసంతిని కోడిలా డ్యాన్స్ చేపించాడు.‌ అయితే రేవంత్ టర్న్ వచ్చేసరికి 'బాహుబలి' సినిమా పేరు గీసి చెప్పాలి. రేవంత్ గెలిచాడు. దీంతో బిగ్ బాస్, అదే సినిమాలోని రేవంత్ పాడిన 'మనోహరి సాంగ్' ప్లే చేసాడు. దానికి రేవంత్ డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. అయితే ఈ వారం బిగ్ బాస్ కానుక రేవంత్ కి వచ్చింది. చివరగా మెరీనా, వసంతి నామినేషన్లో ఉన్నారు. కాగా ఇందులో వసంతి ఎలిమినేట్ అయ్యింది. ‌ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరు ఎమోషనల్ కాగా, "అందరు బాగా ఆడండి‌. ఆల్ ది బెస్ట్ అందరికి" అని చెప్పేసి, నాగార్జున దగ్గరకి వచ్చేసింది. కాసేపు నాగార్జునతో మట్లాడింది. ఆ తర్వాత వసంతి తన 'AV' చూస్తూ కంటతడి పెట్టుకుంది. "వండర్ ఫుల్ జర్నీ. మిస్ యూ ఆల్" అని వసంతి అంది.

"బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవెర్ , బెస్ట్ ఫేక్ ఫ్రెండ్స్ ఎవరు" అని నాగార్జున అడిగాడు. "మెరీనా, రేవంత్, కీర్తి భట్, ఇనయా బెస్ట్ ఫ్రెండ్స్. రాజ్, ఆదిరెడ్డి, ఫైమా వీళ్ళతో నాకు ఎక్కువ రాపో లేదు. అందుకే వీళ్ళని ఫేక్ ఫ్రెండ్స్ " అని వసంతి చెప్పింది. అలా సండే ఫండే ఎపిసోడ్‌ ముగిసింది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.