English | Telugu

ఓట్ అప్పీల్ పేరుతో‌ అర్జున్ కు చుక్కలు చూపించిన బిగ్ బాస్!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ తో ఫన్ గేమ్ అంటు రెండు బ్యాచ్ ల మధ్య చిచ్చుపెడుతున్నాడు బిగ్ బాస్. ఒక్కో టాస్క్ కి ఒక్కో గొడవ జరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో రెండవ కంటెండర్ ఓట్ అప్పీల్ చేసుకునేందుకు గాను ఒక టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో‌ హౌస్ లోని వారందరిని తోసుకొని వచ్చి గంట కొట్టి అర్హత సాధించాడు అర్జున్.

దీంతో తనని కన్ఫెషన్ రూమ్‌కి రమ్మన్నాడు బిగ్‌బాస్. తీరా వచ్చిన తర్వాత ఎదురుగా క్లాత్స్ కప్పేసిన రెండు ప్లేట్స్ ఉంచి, అందులో నీకు నచ్చినది ఎంచుకోమని బిగ్‌బాస్ కోరాడు. దీంతో ఒక క్లాత్ తీసి చూస్తే ఆ కప్పులో మూడు పచ్చి ఉల్లిపాయలు ఉన్నాయి. ఇదేంటి బిగ్‌బాస్ అని అర్జున్ అడుగగా.. ఓట్ అప్పీల్ చేసుకునేందుకు కంటెండర్ కావాలంటే ఆ మూడు పచ్చి ఉల్లిపాయలని పది నిమిషాల్లో తినాలని, లేకపోతే రెండో బాక్స్ ఓపెన్ చేసి అందులో ఏముంటే అది చేయాలనే కండీషన్ పెట్టాడు బిగ్‌బాస్. ఇక అది విని.. వద్దు బిగ్‌బాస్ ఇవే తినేస్తానని మొత్తానికి అర్జున్ ఎలాగోలా వాటిని తిన్నాడు. అయిన ఈ మధ్య ఫుడ్‌కి సంబంధించిన టాస్కులన్నీ మీకే వస్తున్నాయ్ ఎందుకని అనుకుంటున్నారు అర్జున్ అని బిగ్ బాస్ అడిగాడు. "చూడటానికి దున్నపోతులా ఉన్నాను కదా తింటానని మీ అభిప్రాయం బిగ్‌బాస్" అని అర్జున్ అన్నాడు.

ఇక మరో మూసి ఉన్న క్లాత్ ని ఓపెన్ చేయమంటాడు. అందులో ఆరు ఉల్లిపాయలు‌ ఉంటాయి. వామ్మో అని దండం పెడతాడు అర్జున్. కాస్త స్వీట్ ఇప్పించండి బిగ్ బాస్ అని అర్జున్ అడుగగా.. స్వీట్ తినడానికి ఇష్టపడతారా? లేక స్వీట్ లాంటి కేక్ పంపించమంటారా అని బిగ్ బాస్ అడుగుతాడు. అతిగా తింటే ఏదైనా దారుణమే బిగ్‌బాస్. నేను రెండు ఎంచుకోను అంటూ అర్జున్ సమాధానమిచ్చాడు. మొత్తానికి ఇచ్చిన టైమ్ లోపే టాస్క్ పూర్తి చేశాడు అర్జున్. దీంతో మీరు ఓట్ అప్పీల్ చేసుకునేందుకు ముందుకు వెళ్లారు.. కంగ్రాట్స్ అని బిగ్‌బాస్ అన్నాడు. వెళ్లేముందు పక్క బాక్స్‌లో ఏముందో చూడాలనుకుంటున్నారా అని బిగ్‌బాస్ అడగడంతో అవును అంటూ క్లాత్ తీశాడు అర్జున్. తీరా అందులో ఐదు ఉల్లిపాయలు చూసి వామ్మో అనుకున్నాడు అర్జున్. ఇక ఆ ఘాటుకి తట్టుకోలేక స్వీట్‌గా ఏమైనా ఇవ్వొచ్చుగా బిగ్‌బాస్.. అంటూ అర్జున్ అడిగాడు. కేకు పంపించమంటారా అని బిగ్ బాస్ అనగానే.. వామ్మో వద్దయ్యా.. ఇక్కడి నుంచి వెళ్లేవరకు ఇక స్వీట్ కూడా అడగను బిగ్‌బాస్ అంటూ దండం పెట్టేశాడు అర్జున్.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.