English | Telugu

చిన్నప్పటి నుంచి నాకు సీనియర్స్ అంటేనే క్రష్..ఎందుకో తెలీదు!

ఫస్ట్ మూవీ ఉప్పెనతో బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు హీరో వైష్ణవ్ తేజ్. ఇక రెండో సినిమా కొండపొలం మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా హిట్ కాలేదు. ఈ మూవీస్ కి ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ నటించిన రంగరంగ వైభంగా మూవీ సెప్టెంబర్ 2 న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ ఆలీతో సరదాగా షోకు వచ్చారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా షూటింగ్ టైంలో చిరు గారు కోప్పడారట" అని ఆలీ అడిగేసరికి "ఒక సీన్ లో బాగా నవ్వేశానని అప్పుడు పెదమామయ్య చిరంజీవి సీరియస్ అయ్యారని" చెప్పుకొచ్చారు. ఉప్పెనలో ఒక సీన్ గురించి అడిగిన ప్రశ్నకు " ఆ మూవీలో ఒక సీన్ చేస్తున్నప్పుడు అస్సలు ఎమోషన్స్ రావడం లేదు. దానికోసం 20 టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. నా కోసం అంతమందిని ఇబ్బంది పెడుతున్నా అనుకునేసరికి నాలో బాధ, కన్నీరు వచ్చేసాయి..ఫైనల్ గా ఆ ఎమోషన్ తో ఆ సీన్ పూర్తి చేశానని" చెప్పాడు.

"ఎవరికైనా జూనియర్స్ మీద క్రష్ ఉంటుంది మరి నీకు అనేసరికి.." " నాకెప్పుడూ సీనియర్స్ అంటేనే క్రష్ అదేంటో నాకు తెలీదు..చిన్నప్పటినుంచి అంతే " అని నవ్వేసాడు వైష్ణవ్ తేజ్. ఎవరైనా సినిమాలు పది సార్లో ఇరవై సార్లో చూస్తారు మరి నువ్వెంటి అని ఆలీ అడిగేసరికి " పవన్ మామయ్య సినిమాలంటే చాలా ఇష్టం. తమ్ముడు సినిమాను 120సార్లు బద్రి సినిమాను 130సార్లు చూసాను..వాటిల్లో ఏ డైలాగ్ అడిగిన చెప్పేస్తా" అంటూ చెప్పాడు వైష్ణవ్ తేజ్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.