English | Telugu
సక్సెస్ అయ్యాక ప్రేమించిన అమ్మాయి నుంచి ఫోనొచ్చింది!
Updated : Aug 26, 2022
ఢీ - 14 లో ఒక్కొక్కరు తమ ఫస్ట్ లవ్ ఎక్స్పీరియెన్సులు చెప్పి ఆ రోజుల్ని గుర్తుచేసుకున్నారు. హైపర్ ఆది జబర్దస్త్ ద్వారా ఎంత ఫేమస్ అనే విషయం అందరికీ తెలుసు. ఐతే ఆదికి ఒక ఫస్ట్ లవ్ ఉంది. ఆ విషయం గురించి తన మాటల్లో అందరితో షేర్ చేసుకున్నాడు. "8th క్లాస్ వరకు మా ఒళ్లోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. 9th కి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. 10th క్లాస్ కి వెళ్ళాక అప్పుడొచ్చిందయ్యా ఆ అమ్మాయి. నాకంటే చాలా బాగుంటుంది..నాకంటే చాలా బాగా చదువుతుంది. 10th క్లాస్ మొత్తం కూడా అమ్మాయిని నేను, నన్ను ఆ అమ్మాయి ఒకరికొకరం చూసుకోవడమే సరిపోయింది. ఎప్పుడూ హాయ్ చెప్పుకోలేదు చిన్న మాట కూడా మాట్లాడుకోలేదు. స్టడీ అవర్స్ లో ఆ అమ్మాయికి ఎదురుగా కూర్చునేవాడిని.
తను నన్ను చుసేదో కాదో అనే డౌట్ ఉండేది. ఆ విషయంలో క్రాస్ చెక్ కూడా చేసుకున్న. ఒకసారి ప్లేస్ మారి లాస్ట్ లో కూర్చున్నా. అప్పుడు ఆ అమ్మాయి నన్ను వెతికి మరీ చూసింది. అప్పుడు అర్ధమయ్యింది. అంతలో 10th ఐపోయింది. ఇంటర్ కి నేను బాయ్స్ కాలేజీ, ఆ అమ్మాయి లేడీస్ కాలేజీ. అప్పుడనిపించింది ఆ అమ్మాయితో మాట్లాడినా బాగుండేదని. ఇంటర్ రెండేళ్లు ఆ అమ్మాయి గురించే ఆలోచన. తర్వాత బీటెక్ కి వచ్చాను. బీటెక్ చదవాలంటే కంప్యూటర్స్ నేర్చుకోవాలని చెప్పేసరికి కంప్యూటర్ క్లాస్ లో జాయిన్ అయ్యాను. ఆ రోజు క్లాస్ ఐపోయి కిందకి వస్తున్నప్పుడు చూసా రెండేళ్ల తర్వాత ఆ అమ్మాయి నడుచుకుంటూ అలా వచ్చింది. ఆ ఫస్ట్ ఫీలింగ్ సూపర్ . చిన్న స్మైల్స్ ఇచ్చుకున్నాం. తర్వాత తను కూర్చునే ప్లేస్ లో నా ఫోన్ నెంబర్ రాసిన కాయితాన్ని పెట్టాను తను అది తీసుకుని వెళ్ళిపోయింది. ఆ ఫీలింగ్ ఇంకా గ్రేట్. ఆ అమ్మాయి ఇంటి ల్యాండ్ లైన్ ఇప్పటికీ నాకు గుర్తుంది.
ఫైనల్ గా కలిసినప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన ఫోటో ఇప్పటికీ నా సర్టిఫికెట్స్ మధ్యలో దాచుకున్నా. నేను తను ఇష్టపడే టైంకి ఆ అమ్మాయిని చూసుకునేంత పొజిషన్ లో నేను లేను కాబట్టి అలా బ్రేకప్ అయ్యింది. నేను సక్సెస్ అయ్యాక ఆ అమ్మాయి కాల్ చేసింది. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది." అంటూ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పాడు ఆది.