English | Telugu

బాలయ్యా.. నేను నీకంటే రొమాంటిక్ అయ్యా!

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' సీజన్-2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మిగతా టాక్ షోలకు భిన్నంగా ఫుల్ జోష్ తో బాలయ్య షో నడిపించిన తీరుతో సీజన్-1 పెద్ద హిట్ అయింది. అందుకే సీజన్-2 పై ప్రేక్షకుల్లో ఈ స్థాయిలో ఆసక్తి నెలకొంది. పైగా మొదటి ఎపిసోడ్ లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనడం అదనపు ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

'అన్ స్టాపబుల్' సీజన్-2 మొదటి ఎపిసోడ్ ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటోంది. "మీకు బాబు గారు.. నాకు బావ గారు" అంటూ చంద్రబాబుకి బాలయ్య ఆహ్వానం పలికారు. "నేను స్టూడెంట్ గా ఉన్న టైంలో.. మీరు సినిమాల్లో చేసిన దానికంటే రొమాంటిక్ గా ఉండేవాడిని" అంటూ చంద్రబాబు బాలయ్యతో కలిసి నవ్వులు పూయించారు. 'వైఎస్ రాజశేఖర్ రెడ్డితో స్నేహం' దగ్గర నుంచి 'టీడీపీ 1995 సంక్షోభం' వరకు పలు ఆసక్తికర అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. అలాగే ఈ ఎపిసోడ్ లో నారా లోకేష్ కూడా పాల్గొనడం విశేషం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన లోకేష్ ఫోటోని చూపించి బాలయ్య ప్రశ్న అడగటం ఆకట్టుకుంది. ఇలా కాస్త ఎంటర్టైన్మెంట్, కాస్త ఎమోషన్ తో ప్రోమో ఆద్యంతరం ఆసక్తికరంగా సాగింది.

'అన్ స్టాపబుల్' సీజన్-2 మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 14న ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారం కానుంది. తాజాగా విడుదలైన ప్రోమోతో రెండో సీజన్ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.