English | Telugu

ఘనంగా వివాహం చేసుకున్న బుల్లితెర నటి సునందమాల!

బుల్లితెర సెలబ్రిటీస్ అంతా ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ ఐపోతున్నారు.రీసెంట్ గా టీవీ యాక్టర్స్ ఐన అమర్ దీప్-తేజస్విని వివాహం చేసుకోగా ఇప్పుడు కొన్ని సీరియల్స్ లో లేడీ విలన్ రోల్స్ చేసిన సునందమాల వివాహం చేసుకుంది. వైజాగ్ లో పుట్టి పెరిగిన సునందమాల, ఆ తర్వాత హైదరాబాద్ లో సెటిలైపోయింది. చిన్నప్పటినుంచి ఆమెకు డాన్స్ అంటే పిచ్చి. అలా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాక సీరియల్స్ లో చిన్నచిన్న రోల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.

సునంద తన కెరీర్ స్టార్టింగ్ లో ఈటీవీ, జీ తెలుగులో యాక్ట్ చేసి పాపులారిటీ సంపాదించుకుంది. అలానే ప్రేక్షకులకు ఆమె దగ్గరయింది. ఇక ‘ముద్ద మందారం’ సీరియల్ లో విలన్ రోల్ చేసాక టు స్టేట్స్ లో ఫుల్ ఫేమస్ ఐపోయింది. ‘హిట్లర్ గారి భార్య’ సీరియల్ లో చేసే టైములో సునంద తను ప్రేమించిన శంకర్ అనే వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. అది కూడా చాలా సైలెంట్ గా చేసుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చింది.

ఇప్పుడు పెళ్లి కూడా చాలా సైలెంట్ గా చేసేసుకుంది. ఇక ఆ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. సునంద పెళ్లికి బుల్లితెర నటి రోహిణితో పాటు ‘ముద్ద మందారం’లో హీరోయిన్ గా చేసిన తనూజ వచ్చి కొత్త జంటకు విషెస్ అందించారు. ఈమె పెళ్ళికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.