English | Telugu

ఆఫ్ట్రాల్ టీవీ కాదు సర్...మన షో చాలా కొత్తగా ఉంది

"కామెడీ స్టాక్ ఎక్స్చేంజి" ఈ వారం కూడా ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో ఫస్ట్ సెగ్మెంట్ "అట్లుంటది మనతోని"లో టీవీ గురించిన కాన్సెప్ట్ తో వాళ్ళ వాళ్ళ లైఫ్ లో జరిగిన విషయాలను చెప్పి స్కిట్స్ వేశారు. ఇక ఈ కాన్సెప్ట్ లో అవినాష్ వాళ్ళ నానమ్మ టీవీలో వచ్చే సీరియల్ యాక్టర్స్ తో ఎలా కనెక్ట్ అయ్యి మాట్లడుకుంటూ ఉంటుందో చేసి చూపించాడు. ఇక కామెడీ ఇండెక్స్ ప్రకారం ఈ థీమ్ లో అవినాష్ కి ఎక్కువ మార్కులు పడ్డాయి. తర్వాత వేణు వన్డర్స్ వచ్చి తన కొడుకు తొక్కలో టీవీ అన్నందుకు కోపం వచ్చి టీవీ గురించి ఒకప్పటి హిస్టరీ మొత్తాన్ని "ఆఫ్ట్రాల్ టీవీ కాదు సర్" అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక యాదమ్మ రాజు చిన్నప్పుడు తన చెల్లి ఉంటే రిమోట్ కోసం ఎలా కొట్టుకుని వాళ్ళ నాన్న చేతిలో తన్నులు తిని టీవీని ఎలా పగలగొట్టాడో చేసి చూపించాడు. ఇలా స్టాక్స్ అందరూ ఒక్కో రకమైన యాంగిల్ లో టీవీ గురించి స్కిట్స్ వేసి ఎంటర్టైన్ చేశారు. "నేను ఒక విషయాన్ని గర్వంగా చెప్పగలను..కామెడీ షోస్ చాలా ఉన్నాయి. చాలా చూస్తున్నాం. కానీ మన షోలో సంథింగ్ కనెక్టింగ్ ఇన్సిడెంట్స్ తో చేయడం చాలా కొత్తగా ఉంది" అని చైర్మన్ అనిల్ రావిపూడి షో గురించి చెప్పారు.