English | Telugu

రియ‌ల్ క‌పుల్‌గా మారిన రీల్ క‌పుల్‌!

టీవీ నటుడు, 'సావిత్రమ్మ గారి అబ్బాయి' సీరియల్ హీరో బాబు (చందన్ కుమార్).. నటి కవిత గౌడను వివాహం చేసుకున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ కేవలం ఇరు కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల మధ్య బెంగ‌ళూరులో శుక్రవారం వారి పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించారు. ఇటీవల కుటుంసభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్ధం రహస్యంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బంధంతో ఈ జంట ఒక్కటైంది.

కన్నడలో వీరిద్దరూ కలిసి జంట‌గా 'లక్ష్మీ బారమ్మ' అనే సీరియల్ లో నటించారు. ఆ సమయంలోనే ఒకరినొకరు ఇష్టపడడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి అనంతరం చందన్ మీడియాతో మాట్లాడారు. కరోనా ఆంక్షలు అన్ని ఎత్తివేసి, సాధారణ పరిస్థితులు రాగానే అందరినీ పిలిచి గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

తమ పెళ్లిని ముందుగా అనుకున్న ముహుర్తానికే జరిపించాలని కుటుంబసభ్యులంతా నిర్ణయించారని.. దీంతో కరోనా ప్రోటోకాల్ నడుమ ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ తమ వివాహ తంతు జరిపించినట్లు చందన్ వెల్లడించాడు. మాస్క్ లతో తమ వివాహ శుభకార్యంలో పాల్గొన్న ఈ జంట ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.