English | Telugu

సుత్తికొట్టే సుధీర్‌.. రెచ్చ‌గొట్టే ర‌ష్మీ!

బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా భారీ టీఆర్పీతో దూసుకుపోతోంది జ‌బ‌ర్ద‌స్త్‌. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ కు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకడు. తనదైన పంచ్ లతో హడావిడి చేసే ఈ కమెడియన్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా సుడిగాలి సుధీర్, రష్మీల రిలేషన్ పై అత‌ను వేసిన పంచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రతి గురువారం ప్రసారమయ్యే 'జబర్ద‌స్త్‌' షోలో హైపర్ ఆది టీమ్ లీడర్‌గా పని చేస్తున్న విషయం తెలిసిందే.

అలానే అప్పుడప్పుడు 'ఎక్స్‌స్ట్రా జబర్ద‌స్త్‌' షోలో ఇతర టీమ్స్ లో గెస్ట్ రోల్ చేస్తుంటాడు హైపర్ ఆది. ఇప్పుడు రాకింగ్ రాకేష్ టీమ్ లో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ షోలో హైపర్ ఆది కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఎప్పటిలానే తన కామెడీతో ఎంటర్టైన్ చేసిన హైపర్ ఆది.. జడ్జ్ మనోతో కలిసి ఓ స్కిట్ చేశాడు.

ఆ సమయంలో ఆయనపై పంచ్ ల వర్షం కురిపించాడు. 'మరగబెట్టే మనో.. ఇరగదీసే ఇంద్రజ' అంటూ మీరు కూడా ఓ టీమ్ పెట్టాల్సిందని జడ్జ్ లకు షాకిచ్చాడు. జడ్జ్ ల టీమ్ పేరు చెప్పగానే.. యాంకర్ రష్మీ 'హలో హలో మరి నాకేం టీమ్ లేదా?' అని ప్రశ్నించింది. దానికి వెంటనే స్పందించిన హైపర్ ఆది 'నీకెందుకు లేదు.. సుత్తికొట్టే సుధీర్.. రెచ్చగొట్టే రష్మీ' అంటూ పంచ్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.