English | Telugu

విశ్వా కొడుకు బర్త్‌డే ఫంక్షన్‌లో సందడి చేసిన స్టార్స్

బిగ్ బాస్ కంటెస్టెంట్ విశ్వా తన కొడుకు ర్యాన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ని ఇటీవల ఘనంగా చేసాడు. ర్యాన్ ఏది అడిగితే అది కొనమని తన తమ్ముడు కార్తీక్ పారిస్ నుంచి చెప్పడంతో విశ్వా ర్యాన్ కోసం మంచి షూస్ తీసుకున్నాడు తర్వాత మంచి డ్రెస్ వేసి బర్త్ డే బాయ్ గా రెడీ చేసాడు. ఇక ఈ బర్త్ డే ఫంక్షన్ కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. మానస్ కి స్పైడర్ వెబ్ టాటూ వేయించాడు ర్యాన్ . మోడల్ జెస్సి, రాకింగ్ రాకేష్, సుజాత, సుష్మ కిరణ్, సిద్, విష్ణు, హిమజ, అలేఖ్య, శ్రీవాణి , ఇలా బుల్లి తెర స్టార్స్ అంతా మెరిశారు.

ఇక అలేఖ్య హారికాకు మోకాళ్ళ మీద వంగి ర్యాన్ రెడ్ రోజ్ కూడా ఇచ్చి అందరినీ మెస్మోరైజ్ చేసాడు. అవినాష్ తన యాంకరింగ్ తో ఫుల్ ఫన్ చేసాడు. యాని మాస్టర్ బర్త్ డే బాయ్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇక విశ్వాకి ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం అండగా ఉంది అని చెప్పొచ్చు. అక్కినేని అఖిల్ విశ్వా క్లాస్ మేట్. దీంతోనే నాగార్జున నిర్మించిన “యువ” సీరియల్ లో విశ్వాకి అవకాశం వచ్చింది. అలా నటుడిగా విశ్వ ప్రయాణం మొదలయ్యింది. నాగచైతన్య నటించిన ఫస్ట్‌ మూవీ జోష్ లోనూ విశ్వాకి అవకాశం దక్కింది. అలాగే బాడీ బిల్డర్‌ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.