English | Telugu
కైలాష్‌ని యశ్ ఏం అడిగాడు? ఏం జరగబోతోంది?
Updated : Jul 14, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న `ఎన్నెన్నో జన్మల బంధం` సీరియల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా సాగుతూ ఆద్యంతం ఆసక్తికర మలుపులతో ఆకట్టుకుంటూ గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. నిరంజన్, డెబ్జాని మోడక్ కీలక జంటగా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, బేబీ మిన్ను నైనిక, ఆనంద్, సుమిత్ర, రాజా శ్రీధర్ తదితరలు నటిస్తున్నారు. వేద, యష్ విడిపోయారని, వారి పెళ్లి ఓ నాటకమని ఫ్యామిలీ జడ్జిని ఇంటికి రప్పిస్తుంది మాళవిక. అయితే తెలివిగా వసంత్ ఆ విషయాన్ని వేదకు చెప్పడంతో అంతా అలర్ట్ అవుతారు.
యష్ ఇంటికి చెకింగ్ కోసం వచ్చిన జడ్జి.. మాళవిక చెప్పినట్టుగా ఇక్కడ ఏమీ జరగలేదని, అంతా బాగానే వుందని తెలుసుకుంటుంది. అంతే కాకుండా యష్ - వేదల గురించి ఇరుగు పొరుగు వారు కూడా పాజిటివ్‌గా చెప్పడంతో మరోసారి ఇలాంటి సిగ్గుమాలిని పనికి పూనుకోవద్దని మాళవికని తీవ్రంగా మందలిస్తుంది. 'నా తీర్పు తప్పు కాదని, ఖుషీని నీ కస్టడీకి ఇచ్చి నేను తప్పు చేయలేదని నిరూపించావు వేదా' అని అభినందిస్తుంది. దీంతో యష్ ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంటారు. ఇక జడ్జి వెళ్లిపోయిన తరువాత అంతా సమయానికి విషయం చెప్పి రక్షించావని వసంత్‌ని అభినందిస్తుంటారు.
"చేసింది వేద వదిన. నన్ను అభినందిస్తున్నారేంటి?. తెలివిగా వ్యవహరించి మన ఫ్యామిలీ పరువుని కాపాడింది" అని వసంత్ చెబుతాడు. దీంతో అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. కట్ చేస్తే.. కైలాష్.. ఫోన్ లో వేద ఫొటోలు చూస్తూ వుంటాడు. అప్పుడే సీరియస్ అవుతూ వచ్చిన యష్ .. "నీకు వేద అసిస్టెంట్ తెలుసా?" అని అడుగుతాడు. అందుకు కైలాష్ తెలుసని చెబుతాడు. ఆ తరువాత ఏం జరిగింది? యష్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.