English | Telugu

క‌సి వ‌ల్ల రోడ్డున ప‌డిన తిలోత్త‌మ ఫ్యామిలీ!

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో వీక్ష‌కుల్ని అలిర‌స్తోన్న సీరియ‌ల్ త్రిన‌య‌ని. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసే వ‌రం వున్న ఓ యువ‌తి త‌న భ‌ర్తని ఆప‌ద‌ల నుంచి ఎలా కాపాడుకుంది, త‌న భ‌ర్త స‌వ‌తి త‌ల్లి కుట్ర‌ల‌ని ఎలా చేధించింది, త‌న భ‌ర్త త‌ల్లి హ‌త్య వెన‌కున్న ర‌హ‌స్యాన్ని ఎలా తెలుసుకుంది? అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. అషికా గోపాల్‌, చందూ గౌడ జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణుప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నారెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టించారు.

కొత్త‌గా వ్యాపారం ప్రారంభించాల‌ని బ్యాంక్ లోన్ కోసం వెళ్లిన విశాల్, న‌య‌నిల‌ని అక్క‌డికి వ‌చ్చిన తిలోత్త‌మ‌, క‌సి, వ‌ల్ల‌భ అవ‌మానిస్తారు.. లోన్ ఇవ్వ‌కుండా అడ్డుప‌డ‌తారు. అయితే పుండ‌రీనాథం ప్రాంగ‌ణంలో ల‌భించిన పెట్టెని లోనికి తీసుకొచ్చి తిలోత్త‌మ‌తో ఓపెన్ చేయించేస‌రికి అందులో బంగారు న‌గ‌లు, వ‌జ్రాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. వీటి లెక్క ఎంతుంటుందో చెప్పండి అంటుంది న‌య‌ని మేనేజ‌ర్ తో. కోట్ల‌ల్లో వుంటుంద‌ని, దీన్ని పెట్టుకుని 30 కోట్ల వ‌ర‌కు వెంట‌నే లోన్ ఇచ్చేస్తానంటాడు. అది విని తిలోత్త‌మ‌, క‌సి, వ‌ల్ల‌భ షాక్ అవుతారు. వెంట‌నే వ్యాపారం ప్రారంభిస్తార‌ని క‌సి అంటుంది. ఆ డ‌బ్బుతో వ్యాపారం చేయ‌డం లేద‌ని, గాయత్రీ దేవి కంపెనీకి డిపాజిట్ గా ఇచ్చేస్తున్నామ‌ని చెప్పి షాకిస్తుంది న‌య‌ని.

క‌ట్ చేస్తే తిలోత్త‌మ ఇంట్లో చ‌ర్చ మొద‌ల‌వుతుంది. న‌య‌ని, విశాల్ ఎదుగుతున్నార‌ని వారిని ఎలాగైనా ఆపాల‌ని ఆలోచిస్తుంటారు తిలోత్త‌మ‌, క‌సి, వ‌ల్ల‌భ. అది విన్న విక్రాంత్ మీ వ‌ల్ల కాదంటాడు. క‌ట్ చేస్తే.. ఇంటికి వ‌చ్చిన న‌య‌ని.. కొత్త‌గా వ్యాపారం మొద‌లు పెడుతున్నామ‌ని చెప్పి బొట్టుపెడుతుంది. దీనితో అయినా మీ త‌ల‌రాత మారాల‌ని చెబుతుంది. అంత‌లోనే ఇంటికి సీల్ వేసేస్తారు. ఇంత‌కీ ఏం జ‌రిగింది? ఎందుకు సీల్ వేశారు.. తిలోత్త‌మ ఫ్యామిలీ క‌సి వ‌ల్ల ఎలా రోడ్డున ప‌డింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.