English | Telugu
నిజం చెప్పిన వేద.. కొత్త డ్రామా స్టార్ట్ చేసిన కైలాష్!
Updated : Jul 7, 2022
గత కొన్ని వారాలుగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `ఎన్నెన్నో జన్మల బంధం`. బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఈ సీరియల్ లో నిరంజన్, డెబ్జాని మోడక్ జంటగా నటించారు. ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ఆనంద్, ప్రణయ్ హనుమండ్ల, బేబీ మిన్ను నైనిక, సుమిత్ర, రాజా శ్రీధర్ తదితరులు నటించారు. గత కొన్ని వారాలుగా ఖుషీ అనే పాప చుట్టూ తిరిగిన ఈ సీరియల్ గత వారం నుంచి చిత్ర మైన మలుపులు తిరుగుతూ వేద - కైలాష్ ల చుట్టూ నడుస్తోంది.
పోలీస్ స్టేషన్ లో వున్న వేదని యష్ మొత్తానికి ఇంటికి తీసుకొస్తాడు. అసలు ఏం జరిగింది? అని వేదని నిలదీయడంతో కైలాష్ తనని వేధించడం.. ఇంట్లో వాళ్లందరిని సినిమాకు పంపించేసి తనపై అఘాయిత్యానికి పూనుకోవడం.. అన్నయ్యా అని బ్రతిమాలుకున్నా వినకుండా తనని వేధించాడని చెప్పడంతో యష్ ఒక్కసారిగా షాక్ కు గురవుతాడు.. ఆ వెంటనే కైలాష్ పైకి వెళుతుంటే అతని సోదరి కంచు అడ్డుపడుతుంది. "తను చెప్పింది నమ్ముతున్నావా?" అంటూ యష్ ని నిలదీస్తుంది.
విషయం చేయిదాటేలా వుందని గమనించిన కైలాష్ కొత్త డ్రామా స్టార్ట్ చేస్తాడు. ఇంత జరిగాక ఇంట్లో వుండను అంటూ వెళ్లిపోతున్నానని డ్రామా మొదలు పెడతాడు.. ఇదే సమయంలో సాక్ష్యాలు కావాలంటే నా ఫోన్ లో వున్నాయని కంచుతో చెబుతాడు. అందులో వేదనే తనకు అసభ్యకరంగా మెసేజ్ చేసినట్టుగా క్రియేట్ చేయడంతో కంచు.. వేదని కొట్టి నీచంగా మాట్లాడుతుంది. ఇది గమనిస్తున్న యష్ ఏమీ అనకుండా అక్కడే నిలబడి చూస్తుంటాడు. తను చెప్పిందే నమ్మేసి వేదని అదోలా చూస్తుంటాడు.
విషయం తెలిసిన వేద తల్లిదండ్రులు రావడంతో కథ మరో టర్న్ తీసుకుంటుంది. "వేద మీ భార్య, తనకు అండగా వుండటం భర్త భాధ్యత" అని వేద తల్లి చెప్పినా యష్ లో చలనం వుండదు. "ఇలాంటి ఇంట్లో నా కూతురిని ఒక్కక్షణం కూడా వుండనివ్వను" అంటూ సులోచన తీసుకెళ్లిపోతుంది. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.