English | Telugu
ఆర్య తమ వెంటపడుతున్న వారిని కనిపెట్టాడా?
Updated : Jul 7, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొన్ని వారాలుగా జీ తెలుగులో విజయవంతంగా ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ ట్విస్ట్ లు, మలుపులతో రసవత్తరంగా సాగుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో ప్రధాన జంటగా శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్ కె నటించారు. ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జయలలిత, జ్యోతిరెడ్డి, విశ్వమోహన్, రాధాకృష్ణ, రామ్ జగన్, కరణ్, అనుషా సంతోష్, సందీప్, మధుశ్రీ నటించారు.
జెండే ఫ్లైట్ టికెట్స్ తీసుకురావడంతో ఆర్య - అను హనీమూన్ కోసం మలేసియా బయలుదేరతారు. ఫ్లైట్ ఎక్కాక సాంకేతిక కారణాల వల్ల అది రాజమండ్రిలోని మధురపూడి ఏయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ గా ల్యాండ్ అవుతుంది. రేపు ఫ్లైట్ మలేసియా బయలుదేరుతుంది అని చెప్పడంతో దగ్గరలో వున్న కపోతేశ్వరాలయం టెంపుల్ కు వెళ్లాలనుకుంటారు. జెండే ఏర్పాటు చేసిన మనుషుల సహాయంతో ఫ్రెష్ అయిన అను - ఆర్య వెహికిల్స్ లో కపోతేశ్వరాలయానికి వెళుతుంటారు. ఏయిర్ పోర్ట్ నుంచి వెంబడిస్తున్న బ్యాచ్ కూడా వారిని అనుసరిస్తుంది.
ఆర్య - అను ఆలయ ప్రాంగణంలోకి ఎంట్రీ అవుతారు.. వారి వెంటే కొంత మంది గన్స్ పట్టుకుని వెంబడిస్తారు. అతను చూసి దాడికి పూనుకోవాలని రెడీ అవుతుంటారు. అనుతో వెళుతున్న ఆర్య ఆ గ్యాంగ్ ని పసిగడతాడు. ఆ తరువాత ఏం జరిగింది?.. ఆర్య వారిని పట్టుకున్నాడా? .. ఇంతకీ ఆ గ్యాంగ్ ని పంపించింది ఎవరు? .. ఆర్య - అనులపై దాడికి పూనుకుంది ఎవరు? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.