English | Telugu
బిగ్ బాస్ హౌస్‌లో దొంగలు పడ్డారు!
Updated : Oct 20, 2022
బిగ్ బాస్ హౌస్ రోజు రోజుకి కొత్త టాస్క్‌లతో అలరిస్తోంది. కాగా నిన్నటి ఎపిసోడ్‌లో హౌస్‌లోకి దొంగలు వచ్చి, కంటెస్టెంట్స్‌కి సరిపడా ఉన్నంత ఫుడ్‌ని మొత్తం తీసుకెళ్ళిపోయారు. దొంగలు వచ్చి ఫుడ్ తీసుకెళ్ళడానికి కారణం అంతకముందు మొదలైన 'సెలబ్రిటీ లీగ్ టాస్క్'. ఈ టాస్క్‌లో ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్కో సెలబ్రిటీ పాత్ర ఇచ్చి, ఆ పాత్రలోనే టాస్క్ సమయం ముగిసేవరకు ఉండాలని బిగ్ బాస్ చెప్పగా, ఎవరు కూడా ఆశించినంతగా పర్ఫామెన్స్ ఇవ్వకపోవడంతో బిగ్ బాస్ కి కోపం వచ్చి, అందరిని వెళ్ళిపోమని చెప్పిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో దొంగలు వచ్చి ఫుడ్ తీసుకెళ్ళారు. "ఎప్పుడు అయితే కంటెస్టెంట్స్ తమ పర్ఫామెన్స్‌తో మెప్పిస్తారో అప్పుడే ఫుడ్ వస్తుంది" అని చెప్పాడు బిగ్ బాస్. ప్రేక్షకులు మాత్రం ఎంటర్టైన్మెంట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే నెటిజన్లు మాత్రం తమకు నచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నారు.
"తిండి దండగ అని సింబాలిక్ గా చెప్తున్నాడు బిగ్ బాస్" అని ఒకరు, "ఇది కదా కావాల్సింది. ఫుడ్ కోసం వాళ్ళు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పుడు నిజమైన గేమ్ ఆడుతున్నారు." అని ఇలా నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా ఫుడ్ కోసం అయినా కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తారో? లేదో? చూడాలి మరి.