English | Telugu

ఇనయా కోసం సోషల్ మీడియాలో ఓట్లు అడుగుతున్న ఆర్జీవీ!

సెన్సేషనల్ డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరూ అంటే రామ్ గోపాల్ వర్మ అని ఎవ్వరైనా చెప్పేస్తారు. ఆయన చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి ఆర్జీవీ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఇనయాతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి "మీరు వోట్ చేసి సపోర్ట్ చేయాల్సిన సమయం వచ్చింది" అంటూ ఇనయాకి వోట్ ఎలా వేయాలో మొత్తం వివరించి చెప్పారు ఆర్జీవీ.

కొన్ని రోజుల క్రితం ఒక ప్రైవేట్ పార్టీలో ఫుల్ గా తాగేసి ఇనయతో డాన్స్ చేస్తూ ఆమె కాళ్ళ చుట్టూ తిరిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియో తర్వాత ఇనయఫుల్ ఫేమస్ అయ్యింది.. అంతే బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్‌‌గా అవకాశాన్ని దక్కించుకుంది.

కాక‌పోతే గేమ్ ఆడకుండా అందంతో నెట్టుకొస్తోంది అంటూ బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ చెప్పడం తెలిసిన విషయమే. ఇప్పుడు ఇనయ కోసం రంగంలోకి దిగిన ఆర్జీవీ హాట్ స్టార్, మిస్డ్ కాల్ ద్వారా ఓటు వేయాలని నెటిజన్స్ ని కోరుతున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.