English | Telugu

లాక్‌డౌన్‌.. ఆగిపోయిన సీరియల్ షూటింగ్స్!

కరోనా వైరస్ అన్ని ఇండస్ట్రీలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గతేడాది లాక్ డౌన్ విధించినప్పుడు సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ ఆగిపోయాయి. దీని కారణంగా సినీ, టీవీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మెల్లగా షూటింగ్స్ మొదలవ్వడంతో ఇక పరిస్థితులు చక్కబడతాయని అందరూ భావించారు. సెకండ్ వేవ్ మొదలైనప్పుడు కూడా షూటింగ్స్ ఆగలేదు. ఇటు సినీ, అటు టీవీ దర్శకనిర్మాతలు పలు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ జరిపారు. అయితే సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువ అవుతుండడంతో రీసెంట్ గా తెలంగాణలో ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధించింది.

అప్పటికే వైరస్ ప్రభావంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు షూటింగ్స్ ఆపేశారు. ఇప్పుడు టీవీ రంగానికి చెందిన నిర్మాతలు కూడా షూటింగ్స్ ను ఆపేశారు. తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లాక్ డౌన్ సమయంలో సీరియల్ నటీనటులు, నిర్మాతలకు షూటింగ్ ను ఆపేయాలని సూచించింది. ప్యాచ్ వర్క్ చేసుకునే సీరియల్స్ మినహా.. మిగిలిన షూటింగ్ అన్నీ ఆగిపోయాయి. ఈ నిర్ణయానికి ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ కూడా తమ మద్దతుని తెలియజేసింది.

ఈ విషయంపై స్పందించిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు విజయ్ యాదవ్.. ఎప్పుడైతే లాక్ డౌన్ అనౌన్స్ చేశారో అప్పటినుండి షూటింగ్స్ జరగడం లేదని చెప్పారు. రామోజీ ఫిలిం సిటీలో కూడా షూటింగ్స్ ఆపేశారని చెప్పారు. అయితే కొందరు షూటింగ్స్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయని.. దానికి కారణం ఛానెల్ నిర్మాతల ఒత్తిడే కారణమై ఉంటుందని అన్నారు. కొంద‌రు సీరియ‌ల్ నిర్మాత‌లు సినిమాటోగ్ర‌ఫీ మినిష్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌గారిని క‌లిసి త‌క్కువ మంది క్రూతో షూటింగ్స్‌ను కొన‌సాగించుకుంటామ‌ని ప‌ర్మిష‌న్ అడగాలనుకుంటున్న విషయాన్ని వెల్లడించారు.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.