English | Telugu

రాజ్‌తో మాయ పెళ్ళి.. కావ్య సంతకం పెడుతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -422 లో..‌ మాయకి రాజ్ కి పెళ్లి చేసి ఆ కావ్యని ఇంట్లో నుండి పంపించేస్తానని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఆ మాయ, రాజ్ లు చిలకగోరింకాలాగా కాపురం చేసుకుంటూ మరొక పిల్లాడిని కనడానికి ప్లాన్ చేస్తుంటారని రాహుల్ వెటకారంగా అంటాడు. అదేం లేదు వాళ్ళని సుఖంగా కాపురం ఎలా చేసుకొనిస్తాను.. ప్రతీరోజు రాజ్ తో మాయ గొడవ పడేలా చేస్తాను. అప్పుడు రాజ్ ప్రశాంతంగా ఉండలేడు.. ఆఫీస్ లో నీదే రాజ్యమని రాహుల్ తో రుద్రాణి చెప్తుంది.

మరోవైపు అప్పుకి కావ్య ఫోన్ చేసి.. మా అత్తయ్య మా ఆయనకి, మాయకి పెళ్లి చెయ్యాలనుకుంటుంది. మనం నిజమైన మాయాని వెతకాలని కావ్య అనగానే.. నువ్వు ఇంత అమాయకూరాలివేంటి అక్క? అసలు ఆ మాయ ఎక్కడ దొరుకుతుందని అప్పు అంటుంది. ఆ తర్వాత అంత ఎంక్వయిరీ చేస్తాను.. ఏ చిన్న క్లూ దొరికిన చెప్తానని అప్పు అంటుంది. కాసేపటికి అపర్ణ దగ్గరికి రుద్రాణి వస్తుంది.‌ కావ్య ఎలాగు ఇంత ఆస్తులు వదిలి పుట్టింటికి వెళ్ళదు.. అందుకని రాజ్ కి మాయ కి పెళ్లి చేయడం నాకు ఇష్టమేనని.. ఈ నో అబ్జెక్షన్ ఫామ్ పై సంతకం పెట్టించమని అపర్ణకి రుద్రాణి చెప్తుంది. కావ్య ఎందుకు ఒప్పుకుంటుందని అపర్ణ అనగా.. ఒప్పించాలని తనని కన్విన్స్ చేస్తుంది రుద్రాణి. ఆ తర్వాత కావ్య బాబుని ఎత్తుకొని ఉంటుంది. అప్పుడే స్వప్న వచ్చి.. నువ్వు ఎందుకు ఎత్తుకున్నావ్ ? ఆ బాబు తల్లి ఉంది కదా అని కావ్య దగ్గర నుండి బాబుని స్వప్న తీసుకుంటుంది.

ఆ తర్వాత మాయ, రుద్రాణిల దగ్గరికి స్వప్న బాబుని తీసుకొని వెళ్తుంది. నువ్వు అసలు కన్నతల్లీవేనా బాబుని పట్టించుకోవడం లేదు.. ఇకనుండి నీ దగ్గరే బాబుని ఉంచుకోమని మాయకి బాబుని ఇస్తుంది స్వప్న. దున్నపోతు, బర్రెలాగా పడుకొని దూడని మర్చిపోకని స్వప్న చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత కావ్య బాబు లేకుండా గదిలోకి వస్తుంటే రాజ్ చూసి.. బాబు ఎక్కడ అని అడుగుతాడు. అక్క మాయ దగ్గర వదిలిపెట్టి వచ్చిందని చెప్తుంది. ఏడుస్తాడు కావచ్చని ఇద్దరు అనుకుంటారు. నేను వెళ్లి తీసుకొస్తానని రాజ్ అంటాడు. ఇప్పుడు మాయ దగ్గరికి వెళ్తే అడ్డంగా బుక్ అవుతారని కావ్య అనగానే.. రాజ్ బయపడి వెళ్ళడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.