English | Telugu

కోడలికి కడుపు లేదని అందరికి  తెలిసిపోయింది.. తప్పుని చెల్లి మీదకి తోసేసిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్- 242 లో... స్వప్న ఫ్రెండ్ రియాని బెదిరిస్తుంది రుద్రాణి. ఏం కావాలండి మీకు అని రియా అనగా.. ఏం చేయాలని అడుగు అని రుద్రాణి అంటుంది. స్వప్నకి కడుపు లేదని ఇప్పుడు మా ఇంటికి వచ్చి అందరి ముందు చెప్పాలని రుద్రాణి అనగా.. వద్దని స్వప్నకి చెప్పాను కానీ వినకుండా స్వప్నే బలవంతం చేసిందని రియా అంటుంది. నిన్ను డాక్టర్ వృత్తికి దూరం చేస్తానని, పది నిమిషాల్లో ఇక్కడ ఉండాలని రుద్రాణి అనగానే.. సరేనంటుంది రియా. ఇక అందరి మోహాలు ఎలా ఉంటాయో చూడాలని రుద్రాణి అనగా.‌ అందరి గురించి ఎందుకు అమ్మ, స్వప్న ఇంట్లో నుండి తరిమేస్తే చాలు మన దరిద్రం మొత్తం పోతుందని రాహుల్ అంటాడు.

మరొకవైపు స్వప్నకి శ్రీమంతం గ్రాంఢ్ గా జరిపిస్తుంటారు. ఇక డాడీ కాల్ చేసారు వెళ్ళాలని అనామిక వెళ్ళిపోతుంది. నా కూతురు శ్రీమంతం ఇంత ఘనంగా జరుగుతుంటే ఆ సంతోషం తట్టుకోలేకపోతున్నాని కనకం అనగానే.. ఇవేం చూసావ్ కనకం, ఇంకాసేపట్లో నేను ఇవ్వబోయే గిఫ్ట్ చూస్తే ఏకంగా కళ్ళు తిరిగి పడిపోతావని రుద్రాణి‌ అంటుంది. ఇక అప్పడే రియా రావడంతో.. స్వప్న నీ శ్రీమంతానికి ఎవరొచ్చారో చూడమని రుద్రాణి అంటుంది. ఇక రియాని చూసిన స్వప్న షాక్ అవుతుంది. ఈ డాక్టర్ నీ ఫ్రెండే కదా అని రుద్రాణి అనగానే.. గెస్ట్ గా వచ్చిన డాక్టర్ ని చెకప్ చేయమంటావేంటని అపర్ణ అంటుంది. కోడలా కోడలా కొడుకు పెళ్ళామా దర్జాగా కూర్చుంది చాలు ఇక లేవవే అని స్వప్నని రుద్రాణి అనగానే.. అది విని ఇంట్లోని వాళ్ళంతా షాక్ అవుతారు.

ఇన్ని రోజులు తనకి కడుపు ఉందని, ఈ స్వప్న మనల్ని నమ్మించి, భ్రమలో ఉంచి మనల్ని మోసం చేసింది. నన్ను నా కొడుకుని నిలువాలా ముంచేసి ఎంత నిజం దాచిందో చూశారా అని రుద్రాణి చెప్తుంది. ఏంటే ఇది అని స్వప్నని కనకం నిలదీస్తుంది. శ్రీమంతం దాకా వచ్చేదాకా, నువ్వే ఈ నాటకం ఎందుకు కొనసాగించావ్? ఛీ ఇంత మోసమా? ఇంత పెద్ద అబద్దామా అని కనక‌ం ఏడుస్తుంది‌. అబద్ధం నీ రక్తంలోనే ఉంది. మోసం నీ పెంపకంలోనే ఉందని రుద్రాణి అంటుంది. ఇక రాహుల్ స్టేజ్ మీద నుండి కిందకి లాక్కొచ్చి.‌. ఏంటే ఇది, ఈ నిజం ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదని అడుగుతాడు. నేను తండ్రిని కాబోతున్నానే సంతోషం ఎందుకు లేకుండా చేశావని నిలదీస్తాడు.

ఇక అందరు కలిసి కనకంని తిడతారు. ఇంత చేసిన ఈ తల్లి గాని తల్లి నాకెప్పటికీ కోడలు కాలేదని స్వప్నని రుద్రాణి తిడుతుంది. ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోతే ఇక జీవితంలో నన్ను ఇంట్లోకి రానివ్వరని, ఏదో ఒకటి చేసి ఉండిపోవాలని అనుకుంటుంది స్వప్న. ఏం చెయ్యాలని స్వప్న అనుకుంటుంది. ఇక రాహుల్, రుద్రాణి కలిసి స్వప్నని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తుండగా.. వదలండి నన్ను అని గట్టిగా అరుస్తుంది స్వప్న. " కావ్య.. రావే, ఇంత జరుగుతుంటే ఇంకా నోరు విప్పకుండా అలాగే చూస్తున్నావేంటే? నా భర్త, నా అత్త నన్ను గెంటేస్తుంటే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావంటే? నీ మాట నమ్మి నేను ఇంతదాకా తెచ్చుకుంటే ఏం పట్టనట్టు వినోదం చూస్తున్నావేంటే? నిజం ఏంటో చెప్పు కావ్య" అని స్వప్న అడుగుతుంది.

ఏంటీ కొత్త నాటకం, నీ తప్పుకి కళావతికి మధ్య సంబంధం ఏంటని రాజ్ అడుగగా.. ఉందని స్వప్న అంటుంది‌. నేను కడుపుతో ఉన్నట్టు సలహా చెప్పిందే ఈ కావ్య అని స్వప్న అంటుంది. ‌ఇక అందరు షాక్ అవుతారు. స్వప్న కళావతికి తప్పు చేయాల్సిన అవసరం లేదని రాజ్ అనగా.. " లేదు రాజ్, రాహుల్ నన్ను మోసం చేసి ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నాడని తెలిసి నేను చచ్చిపోవాలనుకున్నాను. అప్పుడు కావ్యే కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్తే రాహుల్ తో నీ పెళ్ళి జరుగుతుందని సలహా ఇచ్చిందని అందుకనే అబద్ధం చెప్పాల్సి వచ్చింది" అని స్వప్న అంటుంది. అక్క చెల్లెళ్ళు కలిసే ఈ నాటకం ఆడుతున్నారా అని రుద్రాణి అనగా.. " నా పెద్ద కూతురు అవకాశవాది అమ్మ. దాని సంతోషం కోసం, సుఖం కోసం ఎంతకైనా దిగజారుతుంది కానీ కావ్య అలా కాదమ్మ, ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ఎవ్వరిని మోసం చేయదు" అని కృష్ణమూర్తి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.