English | Telugu
శోభతో పెళ్లికి రెడీ అంటూ షాకిచ్చిన నిరుపమ్!
Updated : Aug 9, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ తో సాగి టాప్ 1 సీరియల్ గా రికార్డు సాధించింది. అయితే వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలని ఎండ్ చేయడంతో అప్పటి నుంచి తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలని ఆపసోపాలు పడుతూ సాగుతోంది. మంగళవారం ఎపిసోడ్ విశేషాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభంలోనే సౌందర్య.. హిమకు గోరింటాకు పెడుతూ వుంటుంది. ఎంత సౌందర్య మాట్లాడుతున్నా హిమ మాత్రం సైలెంట్ గా చూస్తూ వుంటుంది.
కట్ చేస్తే.. సౌందర్య, హిమల దగ్గరికి ఆనందరావు వస్తాడు. హిమకు మాత్రమే గోరింటాకు పెడితే శౌర్య ఫీలవుతుంది కదా? అంటాడు. దీంతో సరే దాన్ని కూడా పిలువు అంటుంది సౌందర్య.. అయితే శౌర్య ఇంట్లో లేదని, బయటికి వెళ్లిందంటాడు ఆనందరావు. ఇంతలో హిమ ఏడుస్తూ వుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావ్ అని సౌందర్య అడిగితే.. నా మనసులో ఏముందో తెలియదా? అని అంటుంది. దీంతో ఆగ్రహించిన సౌందర్య నీ వయసుకి మించిన ఆలోచనలు మానుకో అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.
కట్ చేస్తే... శోభకు స్వప్న అన్నం తినిపిస్తూ వుంటుంది. ఇంతలో అక్కడికి చేరుకున్న శౌర్య ప్రపంచంలో మీలాంటి అత్తా కోడళ్లు వుండరు అంటూ వెటాకారంగా అంటుంది. ఇందలో అక్కడికి సత్యం వస్తాడు. విషయం తెలిసి సత్యం అక్కడి నుంచి జారుకుంటాడు. ఇక స్వప్న చేతిలో వున్న ప్లేట్ తీసుకుని శోభ నోట్లో అన్నం, స్వీట్లూ బలవంతంగా కుక్కేస్తుంది శౌర్య.. ఇల్లు అలక గానే పండగ కాదు అంటూ ఇద్దరికి వార్నింగ్ ఇస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? నిరుపమ్ ..శోభతో పెళ్లికి ఎందుకు సై అన్నాడు అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే