English | Telugu

భూష‌ణ్ ఫైన‌ల్ గా ఎవ‌రికి చిక్కాడు?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియల్ `త్రిన‌య‌ని`. జ‌ర‌గ‌బోయేది ముందే ప‌సిగ‌ట్టే వ‌ర‌మున్న ఓ యువ‌తి చుట్టూ అల్లుకున్న క‌థ ఇది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా సీరియ‌ల్ ని రూపొందించారు. అషికా గోపాల్‌, చందూ గౌడ జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో పవిత్రా లోకేష్‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు, విష్ణు ప్రియ‌, భావ‌నా రెడ్డి, శ్రీ‌స‌త్య‌, నిహారిక హ‌ర్షు త‌దిత‌రులు న‌టించారు. సురేష్ చంద్ర‌, ప్రియాంకా చౌద‌రి, చ‌ల్లా చందు త‌దిత‌రులు న‌టించారు.

భూష‌ణ్ ని ప‌ట్టుకొని త‌న త‌ల్లి హ‌త్య వెన‌కున్న మిస్ట‌రీని ఛేదించాల‌ని విశాల్ రంగంలోకి దిగుతాడు. వెంట‌నే బ‌స్తీకి వెళ్లి భూష‌ణ్ ఆచూకీ గురించి వెత‌క‌డం మొద‌లు పెడ‌తాడు. ఈ విష‌యం తెలిసిన తిలోత్త‌మ బ్యాచ్ వ‌ల్ల‌భ‌, క‌సి భ‌యాందోళ‌న‌కు గుర‌వుతుంటారు. ఒక వేళ భూష‌ణ్ గ‌న‌క విశాల్ కి దొరికితే తిలోత్త‌మ చావు గ్యారంటీ అంటుంది. దీంతో తిలోత్త‌మ ఓ ప్లాన్ వేస్తుంది. మారు వేషాల్లో బ‌రం కూడా బ‌స్తీకి వెళ్లి భూష‌ణ్ ని వెతుకుదాం అంటుంది.

తిలోత్త‌మ అన్న‌ట్టుగానే తిలోత్త‌మ, వ‌ల్ల‌భ‌, క‌సి మారు వేషాల్లో బ‌స్తీలో భూష‌ణ్ ని వెద‌క‌డం మొద‌లు పెడ‌తారు. ఈ క్ర‌మంలో క‌సి ..విశాల్ కు ఎదురుప‌డుతుంది. కానీ విశాల్ క‌సినిగుర్తు ప‌ట్ట‌లేక‌పోతాడు. త‌న‌నే అడ్ర‌స్ అడిగికి ముందుకు వెళ‌తాడు. ఇదే క్ర‌మంలో పోలీసులు, న‌య‌ని కూడా భూష‌ణ్ గురించి వెత‌క‌డం మొద‌లు పెడ‌తారు. ఈ క్ర‌మంలో క‌సి త‌న‌కు ఎదురుప‌డిన భూష‌ణ్ భార్య‌నే భూష‌ణ్ గురించి అడుగుతుంది. దీంతో విష‌యం అర్థం కావ‌డంతో త‌మ గురించి ఎవ‌రో వెతుకుతున్నార‌ని, భూష‌ణ్ ని అల‌ర్ట్ చేస్తుంది. ఇంత‌కీ భూష‌ణ్ ఎవ‌రికి దొరికాడు? ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.