English | Telugu

నువ్వు పూజకు పనికి రాని పువ్వు అన్న శ్రద్దా..అవాక్కైన జెస్సి

ఢీ షో ప్రతీ వారం మస్త్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. వచ్చే వారం షో మొత్తం కూడా డాన్స్ మాస్టర్స్ స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఒక్కో డాన్స్ మాస్టర్ ఒక్కో రేంజ్ లో పెర్ఫార్మ్ చేసి వావ్ అనిపించారు. చైతన్య మాస్టర్ స్టేజి మీదకు వచ్చి "సర్" మూవీ నుంచి ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేసి అదరగొట్టాడు. మధ్యలో జడ్జి శ్రద్దా వచ్చి చైతన్యతో కలిసి స్టెప్పులేసింది. చైతన్య మాస్టర్ ఎంతో పర్ఫెక్ట్ గా స్టెప్స్ వేయడంతో శేఖర్ మాస్టర్ కూడా ఇంప్రెస్ ఐపోయి "చైతన్య వచ్చాక నా కళ్ళు ఎటూ వెళ్ళలేదు అతని మీదే వున్నాయి" అని కాంప్లిమెంట్ ఇచ్చేసాడు. ఈ సాంగ్ ఐపోయాక స్టేజి మీద కాసేపు నవ్వులు పూయించడానికి జెస్సి, దివ్య వచ్చేసారు. "ఆవిడేంటి అంత వణుకుతోంది" అని ప్రదీప్ అడిగేసరికి "దివ్యకి బాగా చలేస్తోంది అంట" అన్నాడు జెస్సి.

మరి నువ్వేం చేస్తున్నావు జెస్సి అని శేఖర్ మాస్టర్ అడిగేసరికి "కొంచెం వెచ్చగా ఉంటుందని పక్కనే ఉన్నా" అన్నాడు జెస్సి. "వెచ్చగా ఉండాలంటే ముందు మనలో వేడి ఉండాలి కదబ్బా" అని కౌంటర్ వేసాడు శేఖర్ మాస్టర్. సర్లెండి మీరేదైనా అనుకోండి "ప్రదీప్ నువ్వు పొరపాటున మా ఇంటికి వచ్చిన సడెన్గా డోర్ తీసేయకు...ఒకవేళ నువ్వు అలా డోర్ తీస్తే అక్కడో సీన్ కనిపిస్తుంది..అని జెస్సి కొంచెం ఎక్స్ట్రా డైలాగ్ వేసేసరికి "ఏం కనిపిస్తుంది ..ఆరుగురు పతివ్రతల్లో ఒకాయన కూర్చుని ఏడుస్తూ ఉంటాడు కదా అలా కనిపిస్తావు" అని ప్రదీప్ సరదా కౌంటర్ వేసాడు. దాంతో జెస్సికి కోపం వచ్చి నా గురించి మీకు తెలీదు అని బిల్డప్ ఇచ్చేసరికి "నాకు తెలుసు ...నువ్వు పూజకు పనికిరాని పువ్వు" అని జడ్జి శ్రద్దా అనేసరికి అవాక్కయ్యాడు జెస్సి.

తర్వాత కుమార్ మాష్టర్ వచ్చి డాన్స్ చేసేసరికి "ఇదేం డాన్స్ అయ్యా కుమార్ మాష్టర్ ఇది నే సూడలా" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది శ్రద్దా. ఇలా కామెడీగా జరుగుతున్న ఈ షోలోకి సడెన్గా లేడీ గెటప్ లో వచ్చి షాకిచ్చాడు పండు...తన డాన్స్ తో అందరినీ డాన్స్ చేసేలా చేసాడు. శేఖర్ మాష్టర్ కూడా స్టేజి మీదకు వచ్చి పండుతో కలిసి స్టెప్పులేశాడు. "ఈ పెర్ఫార్మెన్స్ తో చితక్కొట్టేశారు, ఇచ్చిపడేశారు, చించిపడేశారు" అని ఒక రేంజ్ లో పండుని పొగిడేసింది శ్రద్దా...ఈ ఎపిసోడ్ 26 న ప్రసారం కాబోతోంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.