Read more!

English | Telugu

గేట్ ఎగ్జామ్ కి కొత్త అర్ధం చెప్పిన పవిత్ర..సెట్ ని హాట్ గా మార్చిన సుస్మిత

సూపర్ క్వీన్ సీజన్ 2 ఈ వారం ఎపిసోడ్ ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఈ వారం "ఫేస్ ఆఫ్ ఛాలెంజ్" రౌండ్ ఇచ్చాడు ప్రదీప్. అందులో భాగంగా ఇద్దరు సూపర్ క్వీన్స్ వచ్చి కొన్ని జోక్స్ చెప్పి మిగతా వాళ్ళను నవ్వించాలి. అలా మొదటగా సుహాసిని-పవిత్ర వచ్చి కొన్ని జోక్స్ చెప్పారు..కానీ అవి పెద్దగా పేలలేదు. కానీ అందులో పవిత్ర గేట్ ఎగ్జామ్ కి కొత్త అర్ధం చెప్పింది.."గేట్ ఎగ్జామ్ రాద్దామని ప్రిపేర్ అయ్యాను బ్రో" అని పవిత్ర అనేసరికి "అసలు గేట్ ఎగ్జామ్ ఎందుకు రాస్తారు" అని పెద్ద డౌట్ ఎక్స్ప్రెస్ చేసాడు ప్రదీప్. పవిత్ర ఆన్సర్ చెప్పలేకపోయేసరికి వెంటనే ప్రదీప్ ఆన్సర్ చెప్పాడు.  "గేట్ పాస్ కోసం రాస్తారు" అని "నైట్ అంతా కష్టపడ్డా బ్రో..పుస్తకాలు పురుగైపోయినా...ఎగ్జామ్ కి వెళ్లినా..వీళ్లకు అసలు డెడికేషన్ ఉండదా బ్రో..ఎగ్జామ్ అంటే లైఫ్..ఫ్యూచర్ ఉంటది బ్రో..గేట్ దగ్గరకు వెళ్తే ఎవరూ రాలేదు బ్రో...ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్ళిపోయా బ్రో " అని చెప్పింది. "గేట్ ఎగ్జామ్ అని చెప్పి గేట్ దగ్గరకు ఎవరూ రాలేదా ..మరి నువ్వేం చేసావ్" అని ప్రదీప్ అడిగేసరికి " గేట్ దగ్గర ఎవరూ లేరని నేను వెళ్ళిపోయా" అని చెప్పింది పవిత్ర. "గేట్ కి ఎంత న్యాయం చేసావో తెలుసా నువ్వు" అని ప్రదీప్ కామెడీగా అనేసరికి ఒక లుక్ ఇచ్చింది పవిత్ర. 

వీళ్ళ తర్వాత కండక్టర్ ఝాన్సీ, బుల్లితెర నటి సుస్మిత మధ్య డాన్స్ పోటీ జరిగింది. ఇక పవిత్రను డాన్స్ ఎలా చేశారు అని ప్రదీప్ అడిగేసరికి "ఝాన్సీ డాన్స్ గురించి మనకు తెలుసు కానీ అరేయ్ ఏంట్రా సుస్మిత  ఆ హాట్ నెస్...సెట్ లో ఉన్న ఏసీ మొత్తం హాట్ ఐపోయింది." అని చెప్పింది.."సుస్మిత  డాన్స్ ఇరగదీసేసావ్..నీ కాస్ట్యూమ్ కూడా చాల హాట్ గా ఉంది. ఇద్దరూ బాగా చేశారు..నువ్వు అంత పెద్ద డాన్సర్ వి అని తెలీదు సుస్మిత ..ఒంట్లో బాలేకపోయినా చాలా బాగా చేసావ్ " అని చెప్పారు ప్రశాంతి, సుహాసిని. ఎస్తేర్-లిఖిత ఈ ఇద్దరి మధ్య సింగింగ్ కాంపిటీషన్ పెట్టాడు ప్రదీప్. ఇద్దరూ కూడా చాలా బాగా పాడారని మిగతా వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. తర్వాత ప్రియాంక, మోనికా ఇద్దరూ కలిసి "మైమ్" చేశారు. వీళ్ళు ఈక్వల్ గా మార్క్స్ విన్ అయ్యారు. ప్రశాంతి, విద్యుల్లేఖ మధ్య ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ రౌండ్ ని కండక్ట్ చేసాడు ప్రదీప్. రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి మధ్య ఎలాంటి కష్టాలు ఉంటాయో చేసి చూపించింది విద్యుల్లేఖ ..తన వాళ్ళ కోసం తన డాక్టర్ చదివే కలను త్యాగం చేసిన అంశాన్ని స్కిట్ గా వేసి చూపించింది ప్రశాంతి..ఇలా ఈ వారం ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ రౌండ్ ప్రతీ ఒక్కరు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు.