English | Telugu
మిమ్మల్ని చూసి ఇంట్లో మమ్మల్ని అలాగే రెడీ అవ్వమంటున్నారు
Updated : Feb 11, 2023
సోషల్ మీడియాలో సురేఖావాణి కూతురు సుప్రీతా చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. అసలు వాళ్ళను అలా పక్కపక్కన చూస్తే తల్లీకూతుళ్లలా అనిపించరు.. ఏదో ఫ్రెండ్స్ లా, సిస్టర్స్ లా కనిపిస్తారు. సురేఖవాణికి 45 ఇయర్స్ వచ్చిన ఇంకా స్వీట్ 20 స్ అన్నట్టుగా ఉంటుంది ఆమె స్ట్రక్చర్..కూతురితో కలిసి పోటీ పడుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఈమె లైట్ పింక్ సారీ కట్టిన ఫోటో ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫొటోకి కూడా నెటిజన్స్ కామెంట్స్ చూస్తే ఒక రేంజ్ లో ఉన్నాయి.
"ఒరిజినల్ బాపు బొమ్మలా ఉన్నారు. హీరోయిన్స్ కి పోటీలా ఉన్నారుగా..మేము మిమ్మల్ని జబర్దస్త్ యాంకర్ గా చూడాలనుకుంటున్నాం..సంతూర్ మమ్మీ..." అని కామెంట్ చేస్తే ఒకావిడ మాత్రం పాపం తన బాధను కామెంట్ రూపంలో చెప్పింది. ‘మిమ్మల్ని చూసి ఇంట్లో మమ్మల్ని కూడా ఇలాగే రెడీ అవ్వమంటున్నారు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఎమోజీని పోస్ట్ చేసింది. ఇకపోతే సురేఖ వాణి త్వరలో ఎవర్నో పెళ్లి చేసుకోబోతుంది అన్న విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.
ఇందులో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడ్డం ఇక కూతురు సుప్రీతా కూడా అమ్మకి పెళ్లి చేసేస్తే పోలా అనే మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. అసలే ఛాన్సెస్ రావడం లేదు అని బాధపడిన సురేఖావాణి ఫొటోస్ ని ఇప్పుడు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ చూస్తే గనక ఆమె పంట పండినట్లు...చేతినిండా అవకాశాలు వచ్చినట్లే.