English | Telugu

రాజ్ ఇంట్లో కనకం పర్ఫామెన్స్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్ -16 లోకి అడుగు పెట్టింది. కాగా శుక్రవారం రోజున నాటి ఎపిసోడ్ లో.. దుగ్గిరాల ఫ్యామిలీని కలవడానికి కనకం రెడీ అవుతుంది. స్వీట్స్, ఫ్రూట్స్ పట్టుకొని రావడానికి ఇద్దరు అబ్బాయిలు ఇలా వీటన్నింటికి తన కూతురు కావ్య అప్పు తీరుస్తుందనే ధీమాతో.. కనకం బాగా రిచ్ గా హుందాగా రెడీ అయ్యి వెళ్తుంది.

మరోవైపు శరత్ వచ్చి కావ్య వేసిన డిజైన్ లు తీసుకొని, ఆమెకు డబ్బులిచ్చి.. ఆ డిజైన్ లని రాజ్ మరదలుకి అమ్ముకుంటాడు. కావ్య వేసిన ఆ డిజైన్ లని తానే వేసానని.. రాజ్ మరదలు రాజ్ కి చెప్తుంది. బాగున్నాయ్ ఎగ్జిబిషన్ లో పెడదామని రాజ్ చెప్తాడు. ఇంతలోనే రాజ్ పిన్ని వచ్చి ఈ రోజు స్వప్న తో డేట్ కి వెళ్తున్నావ్ కదా? గిఫ్ట్ ఏమిస్తావని అడుగుతుంది. డైమండ్ రింగ్ ఇస్తున్నానని రాజ్ తీసుకున్న డైమండ్ రింగ్ చూపిస్తాడు. అప్పుడే రాహుల్ వచ్చి ఆ రింగ్ తీసుకొని.. "ఆ అమ్మాయి కూడా రిచ్. ఇలాంటి వాటికి ఇంప్రెస్ అవ్వదు. ఏదైనా వెరైటీ గా ట్రై చెయ్ రాజ్" అని అంటాడు. ఆ రింగ్ స్వప్నకి ఇచ్చి ఫ్లర్ట్ చేయాలని రాజ్ భావిస్తాడు.

మరోవైపు రాజ్ తో డేట్ వెళ్ళడానికి స్వప్న రిచ్ గా రెడీ అవుతుంది. ఆటోలో వెళ్తే మన గురించి తెలిసిపోతుందని అప్పుతో అంటుంది. దానికి అప్పు సెటైర్ వేస్తూ స్వప్నకి చిరాకు తెప్పిస్తుంది. ఎలాగోలా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తా అంటూ బయల్దేరుతుంది స్వప్న. అప్పు వద్దంటుంది.

రాజ్ ఇంటికి వెళ్లిన కనకం అక్కడి రాజ్ కుటుంబసభ్యులతో అన్నీ అబద్దాలు చెప్తూ నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కనకం కుటుంబం పేదవాళ్ళు అని నిజం తెలిసి కూడా చెప్పకుండా కనకం బయటపడకుండా రుద్రాణి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తుంది. స్వప్న చెప్పింది చెప్పినట్టు రాజ్ అమ్మ వాళ్ళకి డౌట్ రాకుండా మేనేజ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.