English | Telugu

నువ్వు చాలా వీక్ అన్న పవిత్ర...ఎం దమ్ములేదా అన్న సుష్మిత


సూపర్ క్వీన్ సీజన్ 2 సెమీ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సూపర్ క్వీన్స్ తో గేమ్స్ ఆడించాడు ప్రదీప్. ఈ సెమీ ఫినాలేలో టాప్ 5 లో ఉన్న వాళ్లకు మాత్రమే ఫినాలేకి వెళ్లే అవకాశం అని చెప్పేసరికి అందరూ షాకయ్యారు. ఈ రాబోయే వారం ఎపిసోడ్ లో సూపర్ క్వీన్స్ ని టు టీమ్స్ గా డివైడ్ చేసాడు ప్రదీప్.. తర్వాత ఆ టీమ్ లోంచి ఒకరిని, ఈ టీమ్ లోంచి మరొకరిని తీసుకుని ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ గేమ్స్ ఆడించాడు. ఈ గేమ్స్ కూడా ఆడలేని విధంగా ఉన్నాయి. ఇలా ఒక్కో జోడికి ఒక్కో గేమ్ ఇచ్చాడు. ఫైనల్ గా పవిత్ర వెర్సెస్ సుష్మిత మధ్య కాంపిటీషన్ పెట్టడానికి పిలిచాడు. "నువ్వు సుస్మితని సెలెక్ట్ చూసుకున్నావా..నీకు ఇసక తెలుసా...ఇలా జల్లుతుంది" అని పవిత్రను అడిగాడు ప్రదీప్ "సెలెక్ట్ చేసుకుంటే ఏముంది..ఐనా కళ్ళాపి కదా జల్లేది" అని అంది పవిత్ర.

"ఇసుకలో పుట్టినదాన్ని నేను..కాకినాడ ఇక్కడ " అని సుస్మిత అనేసరికి "బేసిక్ గా హాస్పిటల్ లో కదా పుడతారు" కదా అని పవిత్ర అనేసరికి షాకయ్యింది సుష్మిత. "ఈ బ్యాచ్ తో పోల్చుకుంటే సుష్మిత చాలా వీక్ అని నా ఒపీనియన్ అంటూ పవిత్ర అనేసరికి "నేను వీక్ అని నువ్వెలా చెప్తావు" అని సుష్మిత సీరియస్ అయ్యింది. "గేమ్ మొదలుపెట్టే ముందు నాకేం కావాలంటే" అని ప్రదీప్ మధ్యలో వచ్చేసరికి "ఆగండి...ఇక్కడ చాలా చర్చ జరగాలి" అని గట్టిగా చెప్పింది సుష్మిత..అదే సీరియస్ నెస్ తో "నీ హైట్ ఎంత నా హైట్ ఎంత" అని పవిత్రని నిలదీసింది "ఐనా ఫ్రెండ్ షిప్ లో ఏంట్రా ఇవన్నీ" అని కవర్ చేసుకోబోయింది పవిత్ర .."ఫ్రెండ్స్ అన్న మాట మాట్లాడద్దు నువ్వు" అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది సుష్మిత. "అపోనెంట్ ని చేంజ్ చేసుకోవచ్చా" అని పవిత్ర అడిగేసరికి "ఎం నీకు దమ్ము లేదా" అని రివర్స్ లో అడిగింది సుష్మిత. తర్వాత వాళ్ళతో గేమ్ ఆడించాడు. మరి సెమీ ఫినాలే నుంచి ఫైనల్స్ కి ఎవరు సెలెక్ట్ అవుతారు అనే విషయం తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.