English | Telugu
నేను టీవీ కోసమే పుట్టాను.. సుమ క్లారిటీ!
Updated : Dec 28, 2022
స్టార్ యాంకర్ సుమ యాంకరింగ్ మానేస్తునట్లు.. కొంత బ్రేక్ తీసుకోబోతున్నట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పంధించిన ఆమె అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది.
‘‘రీసెంట్‌గా ఒక న్యూ ఇయర్ ఈవెంట్ ని చేసాం. దాని ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఐతే ఆ ప్రోమో సోషల్ మీడియాలో కొంచెం హల్‌చల్ చేస్తోంది. ఆ ప్రోమోలో నేను కొంచెం ఎమోషనల్ ఐన మాట వాస్తవమే. అయితే, మొత్తం ఈవెంట్ అంతా చూస్తే అసలు విషయమేంటో మీకే అర్థమవుతుంది. కంగారు పడకండి.. నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్‌లు పెడుతున్నారు. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను... నేను టీవీ కోసమే పుట్టాను, నేను ఎంటర్‌టైన్మెంట్ కోసమే పుట్టాను, నేను ఎటూ వెళ్లట్లేదు. కాబట్టి, మీరు హాయిగా ఉండండి.. హ్యాపీగా ఉండండి.. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్’’ అని సుమ ఒక వీడియో మెసేజ్ ని రిలీజ్ చేశారు.
సో.. సుమ ఫ్యాన్స్ కంగారు పడాల్సిందేమీ లేదన్న మాటే. రెండు దశాబ్దాలకు పైగా యాంకర్‌గా టాప్ రేంజిని ఆస్వాదిస్తూ వస్తోంది సుమ. వీక్షకులు ఇప్పటికీ ఆమె యాంకరింగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారనేది నిజం.