English | Telugu

హౌస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి ఎమోష‌న‌ల్ అయిన‌ సుదీప!

బిగ్ బాస్ హౌస్ నుండి ప్రతి వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయి బయటకి వచ్చేస్తుంటారు అనేది అందరికి తెలిసిన విషయమే. కాగా ఈసారి అనుకోకుండా సుదీప ఎలిమినేట్‌ అవ్వడం అనేది అటు హౌస్ మేట్స్ ని, ఇటు ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. ఎప్పుడు హౌస్ లో చలాకీగా ఉండే సుదీప, తన లాజిక్ మాటలతో నామినెట్ లో అవతలి కంటెస్టెంట్ నుండి మాట రాకుండా ముక్కు సుటిగామాట్లాడే వ్యక్తి.

సండే ఫండే అంటూ ఒక వైపు గేమ్స్ ఆడిస్తూ, మరో వైపు నామినేషన్లో నుండి ఒక్కొక్కరిని సేవ్ చేస్తు వచ్చాడు నాగార్జున. ఇలా సేవ్ చేయగా, చివరగా సుదీప, ఆదిత్య మిగిలారు. కాగా హౌస్ లో అన్నా చెల్లెళ్లుగా చెప్పుకునే వీరిద్దరిలో ఒకరు సేవ్ అయి, మరొకరు ఎలిమినేట్ అవ్వడం అనేది సుదీప, ఆదిత్యకి బాధ కలిగించే విషయమే. గీతుని రెండు బ్యాటరీలు తీసుకురమ్మన్నాడు నాగార్జున.

ఆ తర్వాత "ఎవరి బ్యాటరీ అయితే ఫుల్ గా ఉంటుందో వాళ్ళు సేవ్, ఎవరిది అయితే సున్నా ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అయి ఇక్కడికి వస్తారు" అని నాగార్జున చెప్పాడు. ఆదిత్యది ఫుల్ ఛార్జ్ అయ్యి సేవ్ కాగా, ఎలిమినేట్ అయింది సుదీప. నిన్న మొన్నటి వరకు ఓటింగ్ లో చివరి స్థానం ఉండడంతో ఎలిమినేట్ అయింది. సుదీప హౌస్ నుండి బయటకొస్తుంటే హౌస్ మేట్స్ అందరు కంటతడి పెట్టుకున్నారు. కాగా ఆదిత్త మాత్రం, "తను నాకు బాగా దగ్గరైంది. ఒక అక్కలాగా కేరింగ్ తీసుకునేది. చాలా మంచిది" అంటూ ఏడ్చేసాడు. హౌస్ మేట్స్ కి 'బై' చెప్పి సుదీప హౌస్ నుండి బయటకొచ్చేసింది. ఆ తర్వాత నాగార్జున ఉన్న స్టేజ్ మీదకి వచ్చింది.

నాగార్జునతో కలిసి తన జర్నీ వీడియోను చూసి కాసేపు నవ్వుకొని, చివరగా ఏడ్చేసింది. ఆ తరువాత హౌస్ మేట్స్ గురించి చెప్పాలి. అక్కడ ఉన్న కూరగాయల్లో ఎవరికీ ఏది సెట్ అవుతుందో అది వాళ్లకు ఇచ్చేయ్ అని నాగార్జున చెప్పగా, ఎవరి స్వభావం ఎలాంటిదో దాన్ని బట్టి కూరగాయలు వాటి లక్షణాలు తెలుపబడ్డాయి అని చెప్పగా, ఒక్కొక్కరికి ఒక్కో ఐటెమ్ ఇచ్చింది సుదీప.

"సుదీప అక్క, నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు. నన్ను బాగా చూసుకున్నారు. నాకు నిన్ను అలా‌ మనసులో తిట్టుకున్నందుకు రీగ్రేట్ గా అనిపిస్తోంది" అని గీతు చెప్పడంతో, సుదీప కొంచెం ఎమోషనల్ అయింది. కాగా నాగార్జున, "అయినా నీకు ఎమోషన్స్ ఏంటి గీతు" అని నాగార్జున సరదాగా‌ అనడంతో అందరు నవ్వేసారు. ఆ తర్వాత ‌ఇక టైం అయ్యిందని చెప్పి సుదీపని బయటికి పంపించేసాడు నాగార్జున.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.