English | Telugu

శుభశ్రీ ఎలిమినేటెడ్.. సీక్రెట్ రూమ్ కి గౌతమ్ కృష్ణ!

బిగ్ బాస్ సీజన్-7 లొ కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీతో ఇప్పటికే హౌజ్ అంతా కళకళలాడుతుంది. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున మొదట్లోనే నామినేషన్లో ఉన్నవారిలో నుండి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు.

నామినేషన్లో ఉన్నవారిని చీకటి గదికి తీసుకెళ్ళి అక్కడ ఒక దెయ్యం లాంటి గెటప్ గల వ్యక్తి ని పంపి, ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వారిని అతను నా దగ్గరికి తోసుకొస్తారని కంటెస్టెంట్స్ అందరికి చెప్పగా అందరు భయపడ్డారు. ఆ తర్వాత శుభశ్రీని ఆ వ్యక్తి సెలక్ట్ చేసి స్టేజ్ మీదకి తీసుకొచ్చేశాడు. ఇక‌ స్టేజ్ మీద ఉన్న నాగార్జున శుభశ్రీ ఎలిమినేటెడ్ అనగానే హౌజ్ లోని వాళ్ళంతా షాక్ అయ్యారు. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే టేస్టీ తేజ, ప్రియాంక జైన్ ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నారు. ఇక శుభశ్రీ ఎలిమినేట్ అవ్వగానే గౌతమ్ కృష్ణ ఎమోషనల్ అయ్యాడు. ఇక స్టేజ్ మీదకి వచ్చిన శుభశ్రీ ఎమోషనల్ జర్నీ చూపిస్తాడు నాగార్జున. అక్కడ హౌజ్ మేట్స్ కి సలహాలు ఇచ్చింది శుభశ్రీ. ఆ తర్వాత శుభశ్రీ బై చెప్పేసి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా మొదట శివాజీ సేవ్ అవుతాడు. ఆ తర్వాత యావర్, ప్రియాంక జైన్ సేవ్ అవుతారు. ఇలా ఒక్కొక్కరు సేవ్ అవ్వగా అమర్ దీప్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ ముగ్గురు మిగులుతారు. గార్డెన్ ఏరియాలో అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ ఫోటోలని మూడు స్టాండ్ లకి ఉంచారు. అందులో రెండు కాలిపోతాయి. ఒకటి కాలదని వారే సేఫ్ అని నాగార్జున అనగా.. కాసేపటికి అమర్ దీప్ సేవ్ అవుతాడు. ఇక మిగిలిన ఇద్దరిలో గౌతమ్ కృష్ణని హౌజ్ మేట్స్ అంతా కలిసి ఎలిమినేట్ చేస్తారు. ఇక స్టేజ్ మీదకి వచ్చిన గౌతమ్ కృష్ణ.. ఎమోషనల్ అవుతాడు. హౌజ్ లో ఎవరెవరు ఎలా ఉంటారో చెప్పమని చెప్పగా గౌతమ్ కృష్ణ చెప్తాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ వెళ్ళిపోతుండగా.. గౌతమ్ కృష్ణని నాగార్జున వెనక్కి పిలుస్తాడు. "నీకొక అవకాశం ఇస్తున్నాను, సీక్రెట్ రూమ్ కి పంపిస్తున్నాను. అక్కడ నువ్వు ఎలా ఉండాలో, నీకేం కావాలో బిగ్ బాస్ చూసుకుంటారు. నిన్ను నువ్వు నిరూపించుకో" అని నాగార్జున చెప్తాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ కి వెళ్ళి టీవీలో ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నింటిని చూస్తుంటాడు గౌతమ్ కృష్ణ.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.