English | Telugu

శృంగారం టైమ్‌లోనే దొంగతనానికి మాకు మంచి అవకాశం!

ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక గౌన్‌ చుట్టూ తిరుగుతూ ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేసింది. అందులో మొదట తాగుబోతు రమేష్‌ డాన్స్‌ వేస్తూ వచ్చాడు. ‘‘దొంగతనం రాత్రి మాత్రమే ఎందుకు చేస్తారు’’ అంటూ తాగుబోతు రమేష్‌ అడిగిన డౌట్‌కి ఆటో రాంప్రసాద్‌ వెరైటీ ఆన్సర్‌ ఇచ్చాడు. ‘‘శృంగారం టైములో బంగారం కోసం ఎవరూ పెద్దగా పట్టించుకోరు..అందుకే ఆ టైంలోనే దొంగతనం చేస్తాము’’. ‘‘ఇంతలో బంగారం ఎంత ఉంటుంది అని నాటి నరేష్‌ అడిగేసరికి ‘‘ఒరే.. ఈ టైములో కూడా నువ్వు బంగారం కోసం అడిగావు తప్ప శృంగారం కోసం అడగలేదు చూసావా’’ అది అన్నాడు ఆటో రాంప్రసాద్‌. ఇక తాగుబోతు రమేష్‌ దొంగలుగా వచ్చిన ఆటో రాంప్రసాద్‌కి, నాటీ నరేష్‌కి ఒక దొంగతనం చేయాలనీ ఒక అమ్మాయి ఒంటి మీద ఉన్న గౌన్‌ని దొంగిలించాలని చెప్పాడు.

అంతేకాదు దాని స్పెషలిటీ కూడా చెప్పాడు ఆ గౌన్‌ ఫైమా వేసుకుంటే ఐశ్యర్య లా కనిపిస్తుందట అందుకే ఆ గౌన్‌ కొట్టుకొస్తే యాభై లక్షలు ఇస్తానని, ఇండియాలో అదొక్కటే గౌన్‌ పీస్‌ ఉందని అది తన భార్య అడిగిందని చెప్పి వాళ్ళతో డీల్‌ మాట్లాడతాడు. ఇక రాంప్రసాద్‌, నరేష్‌ ఇద్దరి దగ్గరకు రౌడీ రోహిణి వచ్చేసరికి ఆమెను పబ్‌కి వెళ్ళడానికి డబ్బులు అడుగుతారు. చివరకు వాళ్ళు కూడా డీల్‌ మాట్లాడి డబ్బులు తీసుకుని పబ్‌కి వెళ్తారు. ఇక షోని హోస్ట్‌ చేయడానికి రష్మీ వచ్చి ‘‘నాకేమన్నా పెళ్లి వయసు వచ్చిందా..నా వెనక పడే వాళ్ళను మెయింటైన్‌ చేయలేక చస్తున్నా’’ అంటూ ఇంద్రజాను అడిగేసరికి ఇంద్రజ కౌంటర్‌ వేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.