English | Telugu

తాగుబోతు రమేష్ ని కొట్టిన ఫైమా



శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఫైమా తాగుబోతు రమేష్ ని ఇష్టమొచ్చినట్టు తిట్టిపారేసింది. అసలు ఒక సీనియర్ కమెడియన్ అని కూడా లేకుండా తిట్టేసింది. "మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక నా పరువంతా గంగలో కలిసిపోయింది" అనేసరికి తాగుబోతు రమేష్ వెళ్ళిపోతాడు. "ఎక్కడికి వెళ్తున్నారు" అని అడిగింది ఫైమా. " పరువు పోయిందన్నావుగా గంగలోకి వెళ్లి తీసుకొస్తా" అని చెప్పాడు. దాంతో ఫైమా తాగుబోతు రమేష్ ని పిచ్చ కొట్టుడు కొట్టింది. ఇక ఇందులో ఒక టాస్క్ ఇచ్చారు ..వేరే వాళ్ళు వచ్చి నెమలీకతో డిస్టర్బ్ చేస్తూ ఉన్నా కూడా టాస్క్ ఆడే వాళ్ళు సూదిలో దారం ఎక్కించాలి. ఐతే నాటీ నరేష్ సూదిలో దారం ఎక్కిస్తుంటే మహేశ్వరీ వచ్చి నెమలీకతో బాగా దిస్తుర్బ్ చేస్తుంది.

ఐనా కూడా నరేష్ దిస్తుర్బ్ కాకుండా దారం ఎక్కించి గెలుస్తాడు. ఇక రష్మీ "నరేష్ ఎం కోరుకుంటున్నావ్" అనేసరికి "కోరుకున్నాక కాదనకూడదు చెప్తున్నా" అన్నాడు. "ఒక చిన్న కిస్ ఇచ్చేస్తే నే వెళ్ళిపోతా" అన్నాడు. దానికి మహేశ్వరీ సిగ్గుపడిపోయింది. పెట్టండిరా "ముద్దే పెట్టు ముద్దే పెట్టు" అనే సాంగ్ ని అని నరేష్ అనేసరికి రష్మీ వచ్చి మంచి ఫీల్ ఉన్న సాంగ్ పెట్టమని అని సలహా ఇచ్చింది. "నాకు ఆ ఫీలే కావాలి" అన్నాడు. ఇక నూకరాజు ఇంద్రజ మీద పెద్ద కౌంటర్ వేసాడు. "ఇంద్రజమ్మకు అంత క్రేజ్ ఉందా రా" అని నరేష్ అడిగేసరికి. " అంత క్రేజ్ ఉందా..మొన్నటికి మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే ..అక్కడ జనాలంతా అరుపులు..ఎందుకంటే బస్సుకు ఎదురు నిల్చుంది అమ్మ..తప్పుకోండి తప్పుకోండి అని అరుపులు " అంటూ కౌంటర్ వేసేసరికి ఇంద్రజ ఫీలైపోయింది. ఇక ఇంద్రజ ఎక్కడ కొడుతుందో అని అక్కడి నుంచి పారిపోయాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.