Read more!

English | Telugu

సావిత్రి, శ్రీదేవిగా కార్తీకదీపం పిల్లలు


నెక్స్ట్ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఈ షోలో లెజెండరీ యాక్టర్స్ శ్రీదేవి, సావిత్రి గారిని తలుచుకుని ఈ ఎపిసోడ్ ని డేడికేట్ చేశారు. ఇక శ్రీదేవి మూవీనే రీరిలీజ్ కావాలని ఒక గ్యాంగ్, కాదు శ్రీదేవి గారి మూవీనే రీరిలీజ్ కావాలని మరో  గ్యాంగ్ మధ్య పోటీ జరిగింది. ఇక ఇందులో వాగ్దేవి సింగింగ్ పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు.

"ప్రియతమా ప్రియతమ" అనే సాంగ్ పాడి వినిపించేసరికి "సాక్షాత్తు ఆ సరస్వతి దేవి కటాక్షం మీ మీద పరిపూర్ణంగా ఉంది" అంటూ ఇంద్రజ కంప్లిమెంట్ ఇచ్చారు. తర్వాత రష్మీ ఒక టాస్క్ ఇచ్చింది..ఒక సాంగ్ ట్రాక్ వస్తుంది దానికి సంబంధించిన ఐటెం టేబుల్ మీద ఉంది అని చెప్పింది. దానికి రాంప్రసాద్- కొమరక్కా-నటకుమారి స్టేజి మీదకు వచ్చారు. "ముద్దెపెట్టు ముద్దెపెట్టు" సాంగ్ ని ప్లే చేసేసరికి కొమరక్కా, నటకుమారి ఇద్దరూ కలిసి లిప్స్టిక్ పెదాలతో రాంప్రసాద్ ముఖం మీద ముద్దులు మీద ముద్దులు పెట్టేసి కిందపడేశారు.

తర్వాత "చిన్నగా చిన్నగా చిన్నగా" అనే సాంగ్ ప్లే చేసేసరికి రోహిణి, భావన ఇద్దరూ కలిసి నాటీ నరేష్ ని పట్టుకోవడానికి పరిగెత్తారు. నరేష్ మాత్రం వాళ్ళ చేతులకు చిక్కకుండా పారిపోయాడు. ఇక తర్వాత ఎండింగ్ లో మాత్రం కార్తీక దీపం సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్స్ సౌర్య అలియాస్ కృతిక సావిత్రి గెటప్ లో,  హిమ అలియాస్ సహృద శ్రీదేవి గెటప్ లో వచ్చి డాన్స్ చేసి ఆడియన్స్ చేత స్టేజి మీద ఉన్నవాళ్ళ చేత కన్నీళ్లు పెట్టించారు. ఇక కీర్తి భట్, కార్తీక్ వచ్చి తమ లైఫ్ స్టోరీ చెప్పి ఇద్దరూ దండలు మార్చుకోవడంతో స్టేజి మీద ఉన్న వాళ్లంతా క్లాప్స్ కొట్టారు. ఇలా ఈ వారం ఎపిసోడ్ రాబోతోంది.