English | Telugu

Eto Vellipoyindhi Manasu:కాలేజీలో వాళ్ళిద్దరు మాట్లాడుకునేది సీతాకాంత్, మాణిక్యం చూడగలరా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -7 లో.. మాణిక్యం తన కుటుంబాన్ని తీసుకొని స్నేహితుడి కూతురు ఎంగేజ్ మెంట్ కి వస్తాడు. అక్కడ ఉన్న పెళ్లి కొడుకు.. మా బాస్ వచ్చే వరకు ఆగండి అని చెప్తాడు. ఆ బాస్ ఎవరో కాదు సీతాకాంత్. ఇంటి ముందు వరకు వచ్చి అక్కడ వాతావరణం చూసి వెనక్కి వెళ్లిపోతుంటే పెళ్లి కొడుకు బయటకు వచ్చి మీరు లోపలికి రాకుంటే నేను పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటానని అనడంతో సీతకాంత్ లోపలికి వెళ్తాడు.

సీతాకాంత్ లోపలికి వెళ్తాడు కానీ అతను కూర్చొడానికి కూడా ప్లేస్ ఉండదు. దాంతో చిరాకు పడుతుంటాడు. మరొకవైపు మాణిక్యం అతని స్నేహితులు ఒక గదిలో డ్రింక్ చేస్తుంటారు. కిచెన్ లో రామలక్ష్మి మిర్చీలు చేస్తుంటుంది. మా బాస్ కీ కుర్చీ తీసుకొని రండి అనగానే.. సీతాకాంత్ ని రామలక్ష్మి చూడదు. వీళ్ళ బాస్ పని చెప్తానంటూ కుర్చీని విరగ్గొట్టి పంపిస్తుంది. దాంతో విరిగిన కుర్చీ పై కూర్చొని సీతాకాంత్ కిందపడిపోతాడు. ఆ తర్వాత నేను కింద కూర్చొని ఉంటానని సీతాకాంత్ కింద కూర్చుంటాడు. ఆ తర్వాత లడ్డులు సరిపోయేలా లెవ్వని ఒక ఆవిడ రామలక్ష్మికి చెప్తుంది. నేను సరిపెడతానంటూ ఉన్న లడ్డులని పిసుకుతుంటుంది. ఆలా చేయడం సీతాకాంత్ చూస్తాడు కానీ అది చేస్తున్నా రామలక్ష్మి మొహం కనిపించదు. అవి తీసుకొని వచ్చి నాకు ఇస్తారా ఏంటి అనుకుంటు ఉండగా.. అవే తీసుకొని వచ్చి సీతాకాంత్ కి ఇస్తారు. దాంతో సీతాకాంత్ తిననంటాడు. తినాలని పెళ్లికొడుకు బలవంతం చేస్తాడు.

ఆ తర్వాత పెళ్లి కూతురుని చూసి పాపం చిన్నపిల్ల.. వాడి ఏజ్ నలభై తన ఏజ్ ఇరవై అని మేనేజర్ చెప్పగానే.. ఇది నేను చూడలేనంటు సీతాకాంత్ బయటకు వెళ్ళిపోతాడు. అదే సమయంలో పెళ్లి కొడుకుని చూసి.. ఇది నేను చూడలేనంటు రామలక్ష్మి బయటకు వెళ్తుంది. మరుసటి రోజు సిరి కాలేజీకి వెళ్తుంది. ధనతో మాట్లాడలని సెక్యూరిటి వాళ్ళని టాబ్లెట్ తీసుకొని రా అంటూ పంపిస్తుంది. వాళ్ళకి సీతాకాంత్ ఫోన్ చేస్తాడు. బయటకు వచ్చామని చెప్పగానే సీతాకాంత్ కంగారుగా కాలేజీ వస్తాడు. సిరి, ధన ఇద్దరు మాట్లాడుకుంటు ఉంటారు. అదే సమయంలో మాణిక్యం కాలేజీకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.