English | Telugu

త్వరలో డివోషనల్ సీరియల్ శ్రీ రేణుక ఎల్లమ్మ

స్టార్ మాలో ఈమధ్య కొత్త కొత్త సీరియల్స్ హడావిడి బాగా జోరుగా సాగుతోంది. బ్రహ్మముడి, మధురానగరిలో వంటి సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మరో కొత్త సీరియల్ రాబోతోంది. ఐతే అది డివోషనల్ సీరియల్ అన్నమాట. "దుష్ట సంహారం కోసం ఒకే ఆత్మలో రెండు శక్తులు పరాశక్తి స్వరూపాలుగా అవతరించిన ఇద్దరు అమ్మాయిల కథ..శ్రీ రేణుకా ఎల్లమ్మ" అంటూ త్వరలో ప్రసారం కావడానికి ప్రోమోని రెడీ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది స్టార్ మా. ఐతే ఈ సీరియల్ టైం స్లాట్ వస్తుంది అనే విషయం ప్రస్తుతానికి రివీల్ చేయలేదు.

ఐతే ఈ సీరియల్ కన్నడలో స్టార్ సువర్ణ ఛానల్ లో ప్రసారమవుతున్న "ఊదోఊదో శ్రీ రేణుక ఎల్లమ్మకు డబ్బింగ్ వెర్షన్ త్వరలో తెలుగులో ప్రసారం కాబోతోంది. ఈ సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ సర్వారి ఎల్లమ్మ రోల్ లో నటిస్తోంది. ఈ చిన్నారి చార్లీ మూవీలో కూడా నటించింది. రేణుక రోల్ లో నమ్మ భైరవి నటిస్తోంది. ఇందుమతి రోల్ లో తేజస్విని శేఖర్, మంగళా దేవి రోల్ లో వీణ పొన్నప్ప, విష్ణుమూర్తి రోల్ లో ఆర్యన్ రాజ్, రేణు మహారాజ్ రోల్ లో తారక్ పొన్నప్ప, స్వర్ణలత రోల్ లో లక్ష్య శెట్టి నటిస్తోంది.

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ టాప్ 10లో ఉంటున్నాయి. వీటిల్లో ఎక్కువశాతం బ్రహ్మముడి, గుప్పెడంత మనసు, ఇంటింటి గృహలక్ష్మి, కృష్ణ ముకుంద మురారి, మల్లీలాంటి సీరియల్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ కొత్త సీరియల్ ఎలా ఉండబోతోంది ఏ టైం స్లాట్ లో ప్రసారం కాబోతోంది అన్న విషయం తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.