English | Telugu
పచ్చబొట్టు వేయించుకున్న రాకేష్...ఏడ్చేసిన సుజాత
Updated : Aug 11, 2023
"శ్రావణ సంతోషాలు" పేరుతో ఈటీవీలో ఒక కొత్త ఈవెంట్ ఈ నెల 20 న ప్రసారం కాబోతోంది. దానికి సంబంధించిన కొత్త ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్స్ గా శ్యామల, సింగర్ సాకేత్ కొమాండూరి వ్యవహరించారు. పాత, కొత్త కలయికతో నటీనటులంతా కూడా మంచి కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో వచ్చేసారు. "మర్యాదగా చెప్తున్నా ఇక్కడ సీనియర్ దంపతులు ఉన్నారు. మా ఆవిడని చాలా జాగ్రత్తగా, అపురూపంగా చూసుకోవాలి" అని రాకింగ్ రాకేష్ అనేసరికి "అక్కడ చూడండి వాళ్ళ ఆవిడని ఎలా పట్టించుకుంటున్నాడో..మీరు కూడా పట్టించుకోండి" అని ప్రీతినిగమ్ తన భర్త నగేష్ కి చెప్పేసరికి "వాళ్ళ ఆవిడను నేను పట్టించుకుంటే బాగుండదు ప్రీతి" అని అమాయకపు ముఖంతో కౌంటర్ వేసాడు నగేష్. ఇక ఈ షోలో శ్రావణ లక్ష్మి పూజలు, ఆటలు, పాటలు, కామెడీ స్కిట్లు అదరగొట్టాయి. అలాగే ఈ షోలో జబర్దస్త్ కమెడియన్ అప్పి తన భార్యతో కలిసి వచ్చాడు.
తన భార్య ఒకప్పుడు తనను అప్పి వదిలేసి ఇండస్ట్రీకి రావడం గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఈ షోలో వాళ్ళ వాళ్ళ భార్యల కాళ్లకు గోరింటాకు పెట్టారు భర్తలు. ఈ ఈవెంట్ లో ఏక్ నాధ్, హరిణి జోడి వచ్చారు. ఏక్ నాధ్ కోసం "జలజలపాతం నీవు" సాంగ్ పాడి వినిపించింది. ఇక లాస్ట్ లో రాకేష్ తన చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. "జీవితంలో మంచి చెప్పేవాళ్ళు, బ్యాక్ బోన్ గా ఉంటారు కొంతమంది. అలా నా జీవితంలో సుజాత ఉంది " అని చెప్పాడు. ఇక ఆ పచ్చబొట్టు వేయించుకున్నంత సేపు ఆ బాధను భరించలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు రాకేష్. అది చూసి స్టేజి మీదకు వచ్చిన జోర్దార్ సుజాత ఏడ్చేసింది. "జ్వరం వచ్చినప్పుడు ఇంజక్షన్ వేయించుకోవడానికి అల్లకల్లోలమైపోతాడు...ఆయన నొప్పిని నేను భరించలేను" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇలా శ్రావణ మాసం సందర్భంగా ఒక మంచి డివోషనల్, కామెడీ, ఫన్నీ ఈవెంట్ త్వరలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది.