English | Telugu

రష్మీ సీటుకు ఎసరు పెట్టడానికి రెడీ ఐన సౌమ్యరావు

ఎక్స్ట్రా జబర్దస్త్ ఎవ్రీ వీక్ మస్త్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఈ వారం కూడా సరికొత్తగా ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక ఈ షో సెలబ్రిటీ స్పెషల్ గా రాబోతోంది. అలనాటి నటి పాకీజా ఈ షోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే ధమ్కీ మూవీ టీం నుంచి విశ్వక్ సేన్, ప్రసన్న వచ్చారు. జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావు కూడా ఈ షోకి వచ్చింది. ఆమె రాగానే కుర్చీలు వేసి ఏ కుర్చీలో కూర్చుంటారు అని కెవ్వు కార్తిక్ అడిగేసరికి "నాకు ఆ చైర్ కావాలి" అంటూ రష్మీ కూర్చున్న చైర్ ని చూపించేసరికి రష్మీ షాకైపోయింది. ఆమె చెవుల్లోంచి పొగలు వచ్చాయి. జబర్దస్త్ షోకే కాదు ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ షో యాంకర్ సీట్ కే టెండర్ పెట్టిందని అంటున్నారు నెటిజన్స్.

వర్ష వైట్ శారీలో "తెల్లా తెల్లని చీర" అనే సాంగ్ పాడుతూ వచ్చింది. వర్ష రష్మీని బాగా ఇమిటేట్ చేస్తున్నట్టు ఆమె చేసే డాన్స్ లా చేస్తూ ఇమేజ్ సంపాదించుకోవడానికి చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇక కొత్త జంట రాకింగ్ రాకేష్ - జోర్దార్ సుజాత వచ్చారు. "అసలు పెళ్లయ్యాక అరుంధతి నక్షత్రాన్ని చూడమంటే నువ్వు నన్ను చూస్తున్నావేంటి" అని అడిగేసరికి "నా స్టార్ నువ్వే కదా" అందుకే అంది సుజాత. విశ్వక్ సేన్ తన బైక్ తీసి "రష్మీ లాంగ్ డ్రైవ్ ఒకేనా" అని అడిగేసరికి "ఒకే అంటుంది హుషారుగా" "ఐతే ఇంకే వీళ్ళు మరి" అని విశ్వక్ అనేసరికి నోరెళ్లబెట్టింది. తర్వాత విశ్వక్ సేన్, ప్రసన్న ఇద్దరూ కలిసి ఒక స్కిట్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేశారు. నెటిజన్స్ విశ్వక్ సేన్ వస్తే రేటింగ్స్ వేరే లెవెల్ లో ఉంటాయ్...ఈ ఉగాదికి ధమ్కీ మూవీ విజయం సాధించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.