English | Telugu

ర‌క్తంతో గీసిన బొమ్మ‌ని చూపించిన జ్వాల‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ఈ రోజు ఎపిసోడ్ లో శౌర్య గురించి హిమ.. సౌంద‌ర్య‌కు చెబుతూ వుంటుంది. ఒక రోజు ఐస్ క్రీమ్ పార్ల‌ర్ లో శౌర్య‌, నిరుప‌మ్ బావ‌ను ప్రేమిస్తున్న‌ట్టు తెలిసింది. త‌న మొబైల్ ఫోన్ లో బావ పేరు నా మొగుడు అని సేవ్ చేసుకుని పెట్టుకుంది అని చెప్ప‌డంతో సౌంద‌ర్య షాక్ అవుతుంది. అది చూసాకే మ‌న‌సు మార్చుకున్నాను అంటుంది హిమ. అంతే కాకుండా అమ్మా నాన్నా చ‌నిపోతూ శౌర్య జాగ్ర‌త్త అని చెప్పారు అంటూ హిమ ఎమోష‌న‌ల్ అవుతుంది.

ఆ మాట‌ల‌కు సౌంద‌ర్య ఎమోష‌న‌ల్ అవుతూ హిమ ను ఓదారుస్తుంది. క‌ట్ చేస్తే.. నిరుప‌మ్‌, జ్వాల‌కి త‌న మ‌న‌సులో మాట చెప్పినందుకు సంతోషంగా ఫీల‌వుతాడు. హిని పెళ్లి చేసుకుని అపురూపంగా చూసుకుంటాను అని త‌న మ‌న‌సులో అనుకుంటాడు. ఇదిలా వుంటే జ‌రిగిందంతా త‌లుచుకుంటూ జ్వాల బాధ‌ప‌డుతూ వుంటుంది. అదే స‌మ‌యంలో జ్వాల ఇంటికి సౌంద‌ర్య వ‌స్తుంది. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ఎందుకొస్తోంద‌ని అడిగితే నిరుప‌మ్ పై తాను పెంచుకున్న ప్రేమ‌ని, క‌న్న క‌ల‌ల‌ని వివ‌రిస్తుంది.

ఇదే స‌మ‌యంలో ర‌క్తంతో గీసిన నిరుప‌మ్ బొమ్మ‌ని చూపిస్తుంది..ఆ బొమ్మ ని చూసి సౌంద‌ర్య ఎమోష‌న‌ల్ అవుతుంది. క‌ట్ చేస్తే... శోభ‌, స్వ‌ప్న మాట్లాడుకుంటూ వుంటారు. ఇదే స‌మ‌యంలో నిరుప‌మ్ తో నా పెళ్లి చేసేయండి అంటుంది శోభ‌. ఆ త‌రువాత జ్వాల ముందు హిమ‌ను బుక్ చేయాల‌ని ప్లాన్ చేసిన శోభ‌.. జ్వాల‌ని హిమ వున్నచోటికి ర‌మ్మ‌ని ఫోన్ చేస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. హిమ‌తో జ్వాల ఎలా ప్ర‌వ‌ర్తించింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.