English | Telugu

Sonia elimination: ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం సోనియా ఎలిమినేషన్..

బిగ్ బాస్ సీజన్-8 లో ఓ శఖం ముగిసింది. అంటే ఇక్కడ శఖం అని ఎందుకు అన్నానంటే.. సోనియా ఇన్ ఫ్లూయెన్స్, ఆ తర్వాత ఎలా కంటెస్టెంట్స్ ఉందనేది ఇప్పుడు తెలుస్తుంది. అదే హౌస్ లో నిన్న జరిగిన సండే ఎపిసోడ్ లొ సోనియా ఎలిమినేషన్ అయి బయటకు వచ్చింది.

సోనియా ఎలిమినేషన్ తో బిగ్ బాస్ ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సీజన్ సెవెన్ లో రతిక, సీజన్ 8 లో సోనియా అంటు.. అబ్బ సాయిరాం సోనియా ఎలిమినేషన్ అయ్యిందంటూ తెగ కామెంట్లు చేసేస్తున్నారు అభిమానులు. ఇక నామినేషన్ లో ఉన్నవారందరిని సేవ్ చేస్తూ చివరగా అదిత్య ఓం, సోనియా, మణికంఠ మిగలగా వారిని యాక్షన్ రూమ్ కి పంపించాడు నాగ్ మామ. అక్కడ ఆదిత్య ఓం సేవ్ అయ్యి హౌస్ లోకి వచ్చాడు.

చివరికి మణికంఠ, సోనియాలు మాత్రమే మిగిలారు. ఇక హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్స్‌తో నాగార్జున మాట్లాడుతూ.. మీరు మణికంఠ ఆటలో పనికి రాడు.. జీరో అని అన్నారు. అతను డేంజర్ జోన్‌లో ఉన్నాడు. అలాగే ఆడియన్స్ సోనియాని లీస్ట్ ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో పెట్టారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి.. హౌస్‌లో ఉన్న మీ తొమ్మది మంది.. ఎవరి పక్షాన నిలబడితే వాళ్లు హౌస్‌లో ఉంటారు. మిగిలిన వాళ్లు ఎలిమినేట్ అవుతారు. సోనియా, మణికంఠలో ఎవరు ఉండాలో వెళ్లాలో నిర్ణయం మీదే అని అన్నారు నాగార్జున. మీరు వేసే ఓటింగ్ మీకు నాకు తప్ప యాక్షన్ రూంలో ఉన్న వాళ్లకి తెలియదు. కానీ మిమ్మల్ని ఆడియన్స్ వాచ్ చేస్తుంటారు.. మీకు 8 సెకన్లు మాత్రమే టైమ్ అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు‌ నాగార్జున. ఈ మణికంఠ హౌస్‌లో ఉండాలని కోరుకునే వాళ్లు లేచి నిలబడండి అని నాగార్జున అడిగాడు. దాంతో హౌస్‌లో ఉన్న తొమ్మది మందిలో.. నిఖిల్, పృథ్వీ, నైనికలు తప్ప.. మిగిలిన ఆరుగురు నబీల్, ఆదిత్య ఓం, విష్ణుప్రియ, ప్రేరణ, విష్ణు ప్రియ, సీతలు మణికంఠే సేవ్ అవ్వాలని స్టాండ్ తీసుకున్నారు. దాంతో ఆడియన్స్ ఓటింగ్, హౌస్ ఓటింగ్ ప్రకారం సోనియా ఎలిమినేట్ అయ్యిందని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత మణికంఠ డేంజర్ జోన్‌ వరకు వచ్చినందున తనని జైలుకి పంపిస్తున్నట్టు.. జైలు నుంచి ఎప్పుడు బయటకు రావాలనేది బిగ్ బాస్ ప్రకటిస్తారని నాగార్జున చెప్పాడు. దాంతో మణికంఠ తనని సేవ్ చేసిన ఆడియన్స్‌కి థాంక్స్ చెప్పి ఎమోషనల్ అయ్యాడు

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.