English | Telugu
సోహైల్ ఈ సీజన్ విన్నర్ ఎవరో చెప్పేశాడు
Updated : Dec 10, 2021
బిగ్‌బాస్ సీజన్ 5 క్లైమాక్స్ చేరింది. దీంతో ఈ సీజన్ విన్నర్ ఎవరనే దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. ఎవరికి తోచింది వాళ్లు చెప్పేస్తున్నారు. కొంత మంది అంటే గత సీజన్ లో కంటెస్టెంట్‌లు వున్న వారు మాత్రం ఖచ్చితంగా ఈ సీజన్ విన్నర్ ఎవరన్నది స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా తాజా సీజన్ విన్నర్ ఎవరన్నది స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఈ సీజన్ విన్నర్ సన్నీ అని, అతని గేమ్ ప్లాన్ బాగుందని, ఎంటర్‌టైన్ చేస్తూరే తర గేమ్ తాను ఆడుతున్నాడని అదే అతన్ని విన్నర్‌గా నిలబెడుతుంది రాహుల్ ఇటీవల స్పష్టం చేశాడు. తాజాగా ఇదే విషయాన్ని బిగ్‌బాస్ సీజన్ 4లో ఆకట్టుకున్న సోహైల్ చెప్పుకొచ్చాడు. హౌస్‌లో వున్న సన్నీ ఈ సీజన్ విన్నర్ అని తేల్చేసిన సోహైల్ హౌస్‌లో సన్నీని చూస్తుంటే గత సీజన్‌లో తనని తాను చూసుకున్నట్టుగా వుందని మురిసిపోయాడు.
బిగ్‌బాస్ విజేతపై మరోసారి క్లారిటీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కూడా. అయితే మిగతా వారి అభిమానులు తనని ట్రోల్ చేయడంతో భయపడిన సోహైల్ ఆ పోస్ట్‌ని డిలీట్ చేశాడట. అయితే తాజాగా మరోసారి తన మనసులోని మాటలని బయటపెట్టేశాడు. `ఎవరికి సపోర్ట్ చేసినా.. మా వాడు ఏం చేసిండు? మా పిల్ల ఏం చేసింది? అని నన్నేసుకుంటున్నారు. కాజల్, మానస్, సన్నీ టాప్‌లో ఉంటారనిపిస్తోందని పోస్ట్ పెట్టా.. మా వాళ్లు ఎటు పోవాలంటూ అందరూ నన్ను గట్టిగానే వేసుకున్నారు. ఇప్పుడిప్పుడే సినిమా స్టార్ట్ చేస్తున్నా..ఇదంతా ఎందుకులే అని భయం వేసింది. దాంతో ఆ పోస్ట్‌ని డిలీట్ చేశా. ఈ వారమైతే సిరి, కాజల్ డేంజర్‌లో వున్నారు. నాకు నచ్చిన కంటెస్టెంట్‌లు శ్రీరామ్, సన్నీ.. ఈ ఇద్దరిలో ఒకరు టైటిల్ గెలుస్తారని ఓపెన్‌గా చెప్పేశాడు సోహైల్.