English | Telugu

నీతోనే డ్యాన్స్ షో చేయడానికి సిరికి డేట్స్ ఖాళీ లేవట!

సిరి హనుమంత్.. బిగ్ బాస్ సీజన్-5 లో ఫైనలిస్ట్ వరకు వచ్చి వెనుతిరిగింది‌. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు తన ఫ్యాన్ బేస్ మాములుగా ఉండేది కాదు. ప్రతీ వారం తనే టాప్ లో ఉండేది. టాస్క్ లో గేమ్స్ లో యాక్టివ్ గా ఉండేది. అయితే షణ్ముఖ్ జస్వంత్ తో తను చనువుగా ఉంటూ వచ్చేది. దాంతో తనకి నెగెటివిటి పెరిగి బయటకు వచ్చేసింది.

అయితే బిగ్ బాస్ కు వెళ్ళేకంటే ముందు నుండి యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ లతో మంచి క్రేజ్ సంపాదించుకున్న సిరి.. బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చాక సెలబ్రిటీ లిస్ట్ లో చేరింది. దాంతో వరసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయింది. ఒక ఓటీటీ రూపొందిస్తున్న వెబ్ సిరీస్ లో శ్రీహాన్ తో కలిసి చేస్తున్నట్టుగా ముందుగానే చెప్పింది సిరి. కాగా జీ5 లో రీసెంట్ గా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న 'పులి-మేక' వెబ్ సిరీస్ లో ఒక ముఖ్య పాత్రని సిరి పోషించిన విషయం తెలిసిందే. అయితే తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే సిరి 'ఆస్క్ మీ క్వశ్చన్' అంటూ అభిమానులతో ముచ్చటించింది.

మీ ఫేవరెట్ హీరో ఎవరని ఒకరు ప్రశ్నించగా.. పవన్ కళ్యాణ్ అండ్ మహేశ్ బాబు అని సమాధానమిచ్చింది సిరి. 'నీతోనే డ్యాన్స్ షో' లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా అక్క అని ఒకరు అడుగగా.. 'చేయాలని చాలామంది అడిగారు కానీ డేట్స్ ఖాళీ లేవు. పులి-మేక వెబ్ సిరీస్ ఒక వైపు స్టార్ట్ అయింది. మరొకవైపు శ్రీహాన్ తో కలిసి చేస్తోన్న వెబ్ సిరీస్.. అసలు డేట్స్ ఎడ్జస్ట్ అవ్వలేదు.. సో మిసింగ్.‌ . నాకు కూడా అందులో పాల్గొనాలని ఉంది కానీ టైం లేద'ని సిరి చెప్పింది.

" బెస్ట్ ఫ్రెండ్ ఎవరు" అని ఒకరు అడుగగా.. "ఆర్జే కాజల్, ప్రియాంక సింగ్" అని ఇద్దరిని మెన్షన్ చేసింది. వీళ్ళతో పాటు జబర్దస్త్ పవిత్ర కూడా ఒక క్వశ్చన్ అడిగింది. "ఏం తింటారు మీరు ఇంత అందంగా ఉండటానికి" అనిపవిత్ర అడుగగా.. తన ఇన్ స్టా ఐడీని మెన్షన్ చేసి యాంగ్రీ రియాక్షన్ ఇచ్చింది సిరి. దీంతో ఇప్పుడు సిరి ఇన్ స్టాగ్రామ్ లో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.