English | Telugu

భలే ఉన్నావ్ అక్క.. హీరోయిన్ గా ఎంట్రీ ఎప్పుడు!

పటాస్ ద్వారాటెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన ఫైమా.. ఆ తర్వాత జబర్దస్త్ లో చోటు దక్కించుకుంది. తనదైన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ -6 తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకొని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తోంది.

జబర్దస్త్ స్టేజ్ మీద ఎంతో మంది కమెడియన్స్ తమ సత్తాని చాటుకొని బిగ్ స్క్రీన్ మీద అవకాశాలు పొందుతున్నారు. జబర్దస్త్ స్టేజ్ మీద చేసిన వేణు వెల్దండి, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ తమని తాము నిరూపించుకుంటున్నారు. అయితే ఇప్పుడు అదే కోవలోకి బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన కొందరు కంటెస్టెంట్స్ చేరారు. పటాస్ ఫైమా త్వరలో ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. అయితే బిగ్ బాస్ తర్వాత మొదలైన బిబి జోడీ డ్యాన్స్ షోలో అదరహో అనేట్టు డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసి ఆర్జే సూర్య-ఫైమా జోడి విజేతలుగా నిలిచారనే విషయం అందరికీ తెలిసిందే. కాగా తాజాగా నాలుగు రోజుల క్రితం తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కి బ్లూ టిక్ వచ్చిందని‌.. బ్లూ టిక్ కేక్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే ఇలా ప్రతీ విషయాన్ని ఫ్యాన్స్ కి తెలిసేలా అప్డేట్ చేస్తున్న ఫైమా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో శారీ ధరించి ఓ రీల్ చేస్తూ 'ఆస్క్ మీ క్వశ్చన్' అంటూ పోస్ట్ చేసింది. దాంతో తన అభిమానులు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు వేయగా వాటికి ఓపికగా సమాధానమిచ్చింది ఫైమా.

"ఎందుకు ఫైమా అక్క ఈ రోజు శారీ కట్టుకున్నావ్" అని ఒకరు అడుగగా.. ఎందుకో సడన్ గా ఈ సాంగ్(నీ పిలుపు కోసం) వినగానే రీల్ చేయాలని అనిపించిందని ఫైమా చెప్పింది. "భలే ఉన్నావ్ అక్క.. హీరోయిన్ గా ఎప్పుడు ఎంట్రీ" అంటే జోక్ అని ఫైమా అంది. "నీతోనే డ్యాన్స్ లో మీకు ఛాన్స్ వస్తే బాగుండు అక్క" అని ఒకరు అడుగగా.. "నో ఆల్రెడీ బిబి జోడీలో చేసాం కదా.. ఓన్లీ కొత్త వాళ్ళే" అని ఫైమా అంది. మ్యారేజ్ ఎప్పుడు అక్క అని ఒకరు అడుగగా.. కమింగ్ సూన్ అని సమాధానమిచ్చింది ఫైమా. మీరు స్ట్రెస్ లో ఉన్నప్పుడు బయటకు రావడానికి ఏం చేస్తారక్క అని ఒకరు అడుగగా.. సాంగ్స్ వింటానని చెప్పింది ఫైమా. అక్క నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటని అడుగగా.‌. చికెన్ అని సమాధానమిచ్చింది ఫైమా. ఇలా తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలన్నింటికి ఓపికగా రిప్లై ఇచ్చింది ఫైమా.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.